14 ఏళ్ల సీత, రామ్‌ కథ

కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు మదిలో గూడు కట్టుకుంటాయి. కొన్ని చిత్రాల్లోని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కొన్నింటిలోని సుందరమైన ప్రదేశాలు కళ్లలో కదలాడుతూ ఉంటుంటాయి. మరికొన్నింటిలోని పాటలు పదే పదే వినాలనిపిస్తుంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే వీటన్నింటిసమ్మేళనంగా నిలుస్తాయి. వాటిలో ‘గోదావరి’ చిత్రం ఒకటి. టైటిల్‌తోనే ఆహ్లాదకర వాతావరణం సృష్టించారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. పేరుకు తగ్గట్టే తెరపై గోదావరిని ఆవిష్కరించి పులకరింపజేశారు. సుమంత్, కమలినీ ముఖర్జీ, నీతు చంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వేసవిలో విడుదలై ప్రేక్షకులకు చల్లదనాన్ని పంచింది. గోదారమ్మ పరిళమాలు వెద జల్లింది. రామ్‌ పాత్రలో సుమంత్, సీతగా కమలినీ నటన కట్టిపడేసింది. రాజిగా నీతు, రవిగా కమల్‌ కామరాజు, కెప్టెన్‌ చింతామణిగా తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కోటిగాడు అనే పేరున్న ఓ కుక్క మాట్లాడటం కొత్త అనుభూతినిస్తుంది. అమ్మని, గోదావరి నదిని, గోదావరి సినిమాను ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాకు రాధాకృష్ణన్‌ అందించిన సంగీతం శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంది. ప్రతి పాట ఆణిముత్యమే. ‘ఉప్పొంగెలే గోదావరి’, ‘అందంగా లేనా’, ‘మనసా గెలుపు’, ‘టిప్పులు తప్పులు’, ‘మనసా వాచ’, ‘రామ చక్కని’... ప్రతి గీతం మధురమే. వివిధ విభాగాల్లో 5 నంది అవార్డులు గెలుచుకుందీ సినిమా. 1 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతం చేసుకుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.