మళ్లీ వస్తాం... మంత్రం వేస్తాం...

మొదట్లో ‌‘అరం‌గ్రేటం’‌.‌ అనం‌తరం ‌‘రీఎంట్ర’‌.‌ అందాల సినీ పరి‌శ్రమలో ఈ రెండు స్టేషన్ల మధ్యే కథా‌నా‌యి‌కల ప్రయాణం.‌ ‌‘నిన్న’‌ల్లో మెరి‌సిన తార‌లంతా మళ్లీ వెండి‌తె‌రకు తళు‌కు‌ల‌ద్దేం‌దుకు ఒక్కొ‌క్క‌రుగా నేడు ‌‘రీ ఎంట్రీ’‌ మంత్రం పఠి‌స్తు‌న్నారు.‌ ఏళ్లు గడి‌చినా.‌.‌.‌వయ‌సుని నియం‌త్రిస్తూ సొగ‌సుల్ని కాపా‌డు‌కుంటూ వచ్చిన అల‌నాటి హీరో‌యిన్లు అంది‌వ‌చ్చిన అవ‌కా‌శాలు చేజి‌క్కిం‌చు‌కుంటూ ప్రేక్ష‌కు‌లకి ‌‘హలో.‌.‌.‌!’‌ చెప్పేం‌దుకు విచ్చే‌స్తు‌న్నారు.‌ ఒక‌నాడు అప్రతి‌హ‌తంగా ప్రతి‌భను నిరూ‌పిం‌చు‌కో‌వ‌డం‌తో‌పాటు అవా‌ర్డులు, రివా‌ర్డులు గెలు‌చు‌కున్న ఈ అభి‌నయ తార‌లకు ‌‘పెళ్లి, పిల్లలు, కుటుంబం’‌ కేవలం విరామ చిహ్నాలే.‌

కథలు వింటూ.‌.‌.‌కల‌ర్‌ఫుల్‌ కలలు కంటూ.‌.‌ నచ్చిన పాత్రల్లో పర‌కాయ ప్రవేశం చేసే క్రమంలో మూడు షిప్ట్‌ల షూటిం‌గ్‌ల సినీ జీవితం నుంచి వైదొ‌లి‌గితే.‌.‌.‌లభిం‌చిన పూర్తి విశ్రాం‌తిని ఎలా స్వీక‌రిం‌చాలో తెలీని అయో‌మ‌యంలో కొట్టు‌మి‌ట్టా‌డు‌తున్న హీరో‌యి‌న్లం‌ద‌రికీ మళ్లీ రంగుల ప్రపంచం సాద‌రంగా స్వాగ‌తి‌స్తోంది.‌ అంతు‌లేని కీర్తి, అవ‌ధు‌ల్లేని అభి‌మాన ధనం, ఎక్క‌డ‌కె‌ళ్లినా ‌‘ఎర్రతి‌వాచీ’‌ స్వాగ‌తాలు, చిరు‌న‌వ్వుల పల‌క‌రిం‌పులు, కర‌చా‌ల‌నాలు, ‌‘ఆటో‌గ్రాఫ్‌’‌లు సినీ జీవి‌త‌మి‌చ్చిన కాను‌కలు.‌ అవన్నీ మాటి‌మా‌టికీ గుర్తొస్తే.‌.‌ ముఖా‌నికి మళ్లీ మేకప్‌ వేయా‌లని, మళ్లీ సిని‌మాల్లో నటిం‌చా‌లని ఎవ‌రికి మాత్రం అని‌పిం‌చదు?

ఆ నేప‌థ్యం‌లోనే.‌.‌.‌సినిమా ప్రపంచం మళ్లీ ‌‘రా.‌.‌రమ్మని’‌ పిలు‌స్తుంటే కాలాన్ని కత్తి‌రించి మరీ కాల్‌షీట్ల్‌ ఇచ్చేం‌దుకు ఏ తార‌యినా సంసిద్ధం.‌ ఏ అవ‌కాశం తలుపు తట్టినా అంబ‌రా‌న్నంటే సంబ‌రంతో ఆహ్వా‌నిం‌చడం సహజం.‌ ఒక‌ప్పటి హీరో‌యిన్లు ఓ సిని‌మాతో రీ ఎంట్రీ ఇస్తు‌న్నా‌రనే సమా‌చారం చాలు.‌.‌.‌ఆ ప్రాజె‌క్ట్‌కి ఎక్క‌డ‌లేని క్రేజ్‌ వచ్చేం‌దుకు.‌ ఓ రకంగా ఇది ‌‘సక్సెస్‌ మంత్ర’‌.‌ సరి‌కొత్త సమీ‌క‌ర‌ణాలు సక్సె‌స్‌కి బాట వేస్తా‌యని నమ్మే దర్శక నిర్మా‌తలు కూడా నాటి తారల కోసం ప్రత్యేక పాత్రల్ని సృష్టిం‌చ‌డంలో ఎక్క‌డ‌లేని ఏకా‌గ్రతను కన‌బ‌రు‌స్తు‌న్నారు.‌

article image
‌‘అత్తా‌రిం‌టికి దారేది’‌తో నదియా.‌.‌.‌
నదియా.‌.‌.‌కొన్నేళ్ల క్రితం అందాల పాత్రలు పోషిం‌చిన అభి‌నేత్రి.‌ కథ‌నా‌యి‌కగా అప్పట్లో అంత విజ‌యా‌లని చూడని ఈ తార చాన్నాళ్ల తర్వాత సెకండ్‌ ఇన్నిం‌గ్స్‌లో ఎక్క‌డ‌లేని క్రేజ్‌ని సొంతం చేసు‌కుంది.‌ కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో వచ్చిన ‌‘మిర్చి’‌ సిని‌మాతో రీ ఎంట్రీ ఇచ్చిన నదియా, మాటల మాంత్రి‌కు‌డంటూ తెలుగు ప్రేక్ష‌కులు ఆత్మీ‌యంగా పిలు‌చు‌కునే త్రివి‌క్రమ్‌ దర్శ‌క‌త్వంలో వచ్చిన ‌‘అత్తా‌రిం‌టికి దారేది’‌ సినిమా విజ‌యా‌నికి నదియా పాత్ర అత్యంత కీలకం.‌ చీర‌క‌ట్టులో హుందాగా కని‌పి‌స్తూనే పాత్రౌ‌చి‌త్యాన్ని ఔపో‌సన పట్టి మరీ ఆమె అభి‌న‌యిం‌చిన తీరు ఆడి‌య‌న్స్‌ని కని‌కట్టు చేసిం‌ద‌న‌డంలో ఏ మాత్రం అతి‌శ‌యోక్తి లేదు.‌ ఆ తర్వాత శ్రీప్రియ దర్శ‌క‌త్వంలో వచ్చిన ‌‘దృశ్యం’‌లో కూడా పోలీ‌సా‌ఫీ‌సర్‌ పాత్రలో ఎంచక్కా ఒది‌గి‌పో‌యింది.‌ శీను‌వైట్ల దర్శ‌కత్వం వహిం‌చిన ‌‘బ్రూస్‌లీ’‌ సిని‌మాలో కూడా నదియా కని‌పిం‌చింది.‌ ‌‘అఆ’‌లో మహా‌లక్ష్మి పాత్రలో కూడా ప్రతి‌భా‌వం‌త‌మైన ప్రద‌ర్శన ఇచ్చిన నదియా నటిం‌చిన లేటెస్ట్‌ చిత్రం ‌‘నా పేరు సూర్య.‌.‌.‌నా ఇల్లు ఇండియా’‌.‌ ప్రస్తుతం నదియా కాల్‌షీట్ల కోసం నిర్మాత దర్శ‌కులు క్యూ కడ్తు‌న్నారు.‌

article image
‌‘మైనే ప్యార్‌కియా’‌ బ్యూటీ మళ్లీ ఆగయా!
భాగ్యశ్రీ.‌.‌.‌.‌దేశాన్ని ఓ ఊపు ఊపే‌సిన బ్యూటీ.‌ 1989లో ‌‘మైనే ప్యార్‌కియా’‌ సిని‌మాతో యావ‌ద్భా‌ర‌తం‌లోని ప్రేక్ష‌కుల్ని ప్రేమ‌మై‌కంలో ముంచె‌త్తిన కథా‌నా‌యిక.‌ ఆ తర్వాత హిందీ, తెలుగు భాషల్లో చెప్పు‌కో‌దగ్గ కొన్ని చిత్రాల్లో మాత్రమే చేసినా.‌.‌.‌భాగ్యశ్రీ అన‌గానే ‌‘మైనే ప్యార్‌కియా’‌ చిత్రం మాత్రమే ప్రేక్ష‌కుల మదిలో మెదు‌లు‌తుంది.‌ ప్రేమ‌కథా చిత్రాల్లో ‌‘మైనే ప్యార్‌కియా’‌ సృష్టిం‌చిన సంచ‌లనం అంతా ఇంతా‌కాదు.‌ ఆ చిత్ర విజ‌యా‌నికి భాగ్యశ్రీ అందం కూడా ప్రధాన కార‌ణంగా చెప్తారు సినీ విశ్లే‌ష‌కులు.‌ సుమారు రెండు దశా‌బ్దాల అనం‌తరం తను ఓ తెలుగు చిత్రాన్ని అంగీ‌క‌రిం‌చింది.‌ 1998లో బాల‌కృష్ణ చిత్రం ‌‘రాణా’‌లో కని‌పిం‌చిన భాగ్యశ్రీ ప్రస్తుతం హీరో రాజ‌శే‌ఖర్‌ కూతురు శివాని హీరో‌యి‌న్‌గా పరి‌చి‌త‌మ‌వు‌తున్న చిత్రంలో ప్రధాన భూమిక పోషిం‌చ‌నుంది.‌ ‌‘టూ స్టేట్స్‌’‌ పేరిట 2014లో బాలీ‌వు‌డ్‌లో సంచ‌లన విజ‌యాన్ని నమోదు చేసు‌కున్న చిత్రం రీమే‌క్‌గా తెలు‌గులో రూపొం‌దు‌తోంది.‌ హిందీలో అర్జున్‌ కపూర్, ఆలి‌యా‌భట్‌ అద్భు‌తంగా నటించి ప్రేక్ష‌కుల ప్రశం‌సలు పొందారు అలి‌యా‌భట్‌ పోషిం‌చిన పాత్రనే తెలు‌గులో శివాని పోషి‌స్తుం‌డగా శివాని తల్లిగా భాగ్య‌శ్రీని ఎంపిక చేశారు.‌ చాన్నాళ్ల తర్వాత తెలు‌గులో తను చేస్తున్న చిత్రమి‌దని మీడి‌యాతో సంతో‌షాన్ని పంచు‌కున్న భాగ్యశ్రీ తెలుగు నేప‌థ్యా‌నికి అను‌గు‌ణంగా కథలో స్వల్ప మార్పులు చేసా‌ర‌న్నారు.‌ ఈ చిత్రంలో అడ‌వి‌శేష్‌ హైద‌రా‌బా‌ద్‌కి చెందిన వ్యక్తి కాగా, శివాని కల‌క‌త్తాకు చెందిన బెంగాళీ బ్రాహ్మణ్‌ కుటుం‌బా‌నికి చెందిన వ్యక్తి పాత్రలో కని‌పి‌స్తుం‌దని చెప్పారు.‌

article image
‌‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’‌లో లయ.‌.‌.‌
మైత్రీ మూవీస్‌ పతా‌కంపై శీను‌వైట్ల, రవి‌తేజ కాంబి‌నే‌ష‌న్‌లో రూపొం‌దు‌తున్న ‌‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’‌ చిత్ర ద్వారా నాటి ‌‘స్వయం‌వరం’‌ తారక లయ రీ ఎంట్రీ ఇస్తోంది.‌ ‌‘భద్రం కొడుకో’‌ చిత్రంలో బాల‌న‌టిగా అరం‌గ్రేటం చేసి ‌‘స్వయం‌వరం’‌ చిత్రం ద్వారా హీరో‌యి‌న్‌గా ఎదిగి.‌.‌ ఆ తర్వాత అనేక విజ‌య‌వం‌త‌మైన చిత్రాల్లో పని‌చే‌సిన లయ చాలా కాలంగా విదే‌శాల్లో ఉంటూ సిని‌మాకి దూర‌మ‌య్యారు.‌ మధ్యలో కొన్ని టీవీ‌షో‌లకు న్యాయ‌ని‌ర్ణే‌తగా, జన‌రం‌జ‌క‌మైన ఈటీవీ ‌‘పాడు‌తా‌తీ‌యగా’‌ ప్రతి‌ష్టా‌త్మక కార్య‌క్రమాల్లో అతి‌థిగా కొన్ని‌సార్లు కని‌పిం‌చిన లయ ఇంత త్వరగా రీ ఎంట్రీ ఇవ్వడం ఆశ్చ‌ర్య‌క‌రమే.‌ అంత‌కు‌ముందు ఎన్టీ‌ఆర్, త్రివి‌క్రమ్‌ కాంబి‌నే‌ష‌న్‌లో రూపు‌ది‌ద్దు‌కో‌బో‌తున్న చిత్రంలో ఓ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ లయను సంప్రదిం‌చి‌నట్లు వార్త‌లొ‌చ్చాయి.‌ ‌‘స్వయం‌వరం’‌ చిత్రా‌నికి మాటల రచ‌యి‌తగా త్రివి‌క్రమ్‌ పని‌చే‌సిన సంగతి తెలి‌సిందే.‌ ఆ పరి‌చ‌యం‌తోనే ఆమెని సంప్రదిం‌చగా లయ తిర‌స్క‌రిం‌చిం‌దనే పుకారు చక్కర్లు కొట్టింది.‌ ఆశ్చ‌ర్య‌క‌రంగా.‌.‌.‌‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’‌ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర దక్కడం వల్లËే అంగీ‌క‌రిం‌చి‌నట్లు బోగట్టా.‌ ఇదే చిత్రంలో లయ కూతురు శ్లోక కూడా బాల‌న‌టిగా కని‌పి‌స్తుంది.‌

మళ్లీ భూమిక.‌.‌.‌
‌‘ఖుషీ’‌ చిత్రంతో తెలు‌గు‌వారి ఆద‌రా‌భి‌మా‌నాల్ని పుష్క‌లంగా పొందిన భూమికా చావ్లా కొన్ని సిని‌మాలు చేసి కొద్ది కాలం విరామం తర్వాత 2017 నాని నటిం‌చిన ‌‘ఎంసిఎ’‌ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.‌ 2014లో వచ్చిన ‌‘ఏప్రిల్‌ ఫూల్‌’‌ చిత్రం తర్వాత తెలు‌గులో ఏ సిని‌మాలో నటిం‌చని భూమిక మళ్లీ నటిం‌చడం ఆమె అభి‌మా‌నుల్సి సంతో‌ష‌పె‌డ్తోంది.‌ ప్రస్తుతం ఈమె చేతిలో సమంత ప్రముఖ పాత్రలో నటి‌స్తున్న ‌‘యూటర్న్‌’‌ తెలుగు, తమిళ్‌ రీమే‌క్‌లో భూమిక ముఖ్య భూమికి పోషి‌స్తోంది.‌ ఈ సిని‌మాలో ఎంతో కీల‌క‌మైన ఆత్మ పాత్రలో నటి‌స్తోంది.‌ ఒక హైవేలో తరచూ యాక్సి‌డెంట్స్‌ జరు‌గు‌తుంటే.‌.‌ ఆ ప్రమా‌దాల రహ‌స్యాల్ని ఛేదించే పాత్రలో సమంత నటి‌స్తుం‌డగా.‌.‌.‌ ఓ యాక్సి‌డెం‌ట్‌లో చని‌పోయి తన మర‌ణా‌నికి కార‌ణ‌మైన వ్యక్తుల మీద ప్రతీ‌కారం తీర్చు‌కునే ఆత్మ పాత్రలో భూమిక నటి‌స్తు‌న్నట్లు విశ్వ‌స‌నీయ సమా‌చారం.‌ ఈ సినిమా కాకుండా చందు మొండేటి దర్శ‌క‌త్వం‌లోని నాగ‌చై‌తన్య, నిధి అగ‌ర్వాల్‌ నాయ‌కా‌నా‌యి‌క‌లుగా తెర‌కె‌క్కు‌తున్న ‌‘సవ్య‌సాచి’‌ చిత్రం‌లోనూ భూమిక నటి‌స్తు‌న్నట్లు సమా‌చారం.‌ ‌‘సవ్య‌సాచి’‌ సినిమా సిస్టర్‌ సెంటి‌మెం‌ట్‌తో రూపొం‌దు‌తు‌న్నట్లు తెలు‌స్తోంది.‌

article image
‌‘కళ్యాణ వైభో‌గమే’‌లో రాశి.‌.‌.‌
అందాల రాశిగా తెర‌ప‌రి‌చి‌తమై అనే‌కా‌నేక సిని‌మాల్లో కథా‌నా‌యి‌కగా నటించి మెప్పిం‌చిన రాశి కొన్ని ప్రత్యేక గీతాల్లో అల‌రిం‌చ‌డమే కాకుండా రెండేళ్ల క్రిందటే తన సెకండ్‌ ఇన్నిం‌గ్స్‌ని స్టార్ట్‌ చేసింది.‌ 2004లో వచ్చిన ‌‘దేవీ అభయం’‌ సినిమా తర్వాత రాశి కొంత‌కా‌లం‌పాటు పరి‌శ్రమకు దూరంగా ఉంది.‌ 2016లో నంది‌నీ‌రెడ్డి దర్శ‌క‌త్వం‌లోని తెర‌కె‌క్కిన ‌‘కళ్యా‌ణ‌వై‌భో‌గమే’‌.‌.‌.‌’‌ చిత్రం ద్వారా టాలీ‌వు‌డ్‌కి రీ ఎంట్రీకి ఇచ్చింది.‌ 2017లో వచ్చిన ‌‘ఆక‌తాయి’, ‌‘లంక’‌ సిని‌మాల్లో కూడా నటిం‌చింది.‌

‌‘స్టాలిన్‌’‌తో ఖుష్బూ
ఎ.‌ఆర్‌.‌ మురు‌గ‌దాస్‌ దర్శ‌క‌త్వంలో చిరం‌జీవి, త్రిష హీరో‌హీ‌రో‌యి‌న్లుగా తెర‌కె‌క్కిన ‌‘స్టాలిన్‌’‌ చిత్రంతో అల‌నాటి కథా‌నా‌యి‌కగా ఖుష్బూ రీ ఎంట్రీ ఇచ్చింది.‌ ఈ సినిమా తర్వాత ‌‘యమ‌దొంగ’‌ చిత్రంలో యముడి భార్య పాత్రలో నటిం‌చింది.‌ ఈ సినిమా తర్వాత సిద్దార్థ, హన్సిక హీరో‌హీ‌రో‌యి‌న్లుగా నటిం‌చిన ‌‘సమ్‌థింగ్‌.‌.‌.‌సమ్‌థింగ్‌’‌ చిత్రంలో అతిథి పాత్రలో నటిం‌చింది.‌ రీసెం‌ట్‌గా త్రివి‌క్రమ్‌ డైరెక్ష‌న్‌లో పవన్‌ కళ్యాణ్, కీర్తి‌సు‌రేష్, అను ఇమ్మా‌న్యు‌యేల్‌ హీరో‌హీ‌రో‌యి‌న్లుగా నటిం‌చిన ‌‘అజ్ఞా‌త‌వాసి’‌ చిత్రం‌లోనూ ఖుష్బూ కీల‌క‌పాత్ర పోషిం‌చింది.‌

article image
రీఎం‌ట్రీతో ఇంద్రజ బిజీ
‌‘యమ‌లీల’, ఒక చిన్న‌మాట’, ‌‘సొగసు చూడ‌త‌రమా’, ‌‘పెద్ద‌న్నయ్య’‌ తది‌తర విజ‌య‌వం‌త‌మైన ఎన్నో చిత్రాల్లో నాయిక పాత్రలు పోషిం‌చిన ఇంద్రజ కూడా ఇటీ‌వలే టాలీ‌వు‌డ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది.‌ 2014లో త్రికోటి దర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య తెర‌కె‌క్కిన ‌‘దిక్కులు చూడకు రామయ్య’‌ చిత్రం ద్వారా మళ్లీ తెర‌పై‌కొ‌చ్చింది.‌ ఈ సినిమా తర్వాత ఇంద్రజకు వరు‌స‌పెట్టి సినిమా ఆఫర్లు రావడం విశేషం.‌ బాల‌కృష్ణ చిత్రం ‌‘లయన్‌’, ‌‘శమం‌త‌క‌మణి’, ‌‘శత‌మానం భవతి’‌ వంటి సిని‌మాల్లో నటిం‌చింది.‌ ఇటీ‌వల ‌‘అజ్ఞా‌త‌వాసి’‌ చిత్రంలో కూడా ఇంద్రజ కీల‌క‌పాత్ర పోషిం‌చింది.‌ ప్రస్తుతం సుమంత్‌ అశ్విన్, నిహా‌రిక కొణి‌దెల నాయి‌కా‌నా‌య‌కు‌లుగా నటి‌స్తున్న ‌‘హ్యాపీ వెడ్డింగ్‌’‌ సిని‌మాలో ఇంద్రజ కీల‌క‌పాత్ర పోషి‌స్తోంది.‌

article image
మళ్లీ రంభ రంగ‌ప్రవేశం.‌.‌.‌
‌‘ఆ ఒక్కటి అడక్కు’‌ అనే చిత్రం ద్వారా పరి‌చ‌య‌మైన రంభ కూడా తిరిగి రంగ‌ప్రవే‌శా‌నికి సిద్ధ‌మై‌పో‌యింది.‌ టాలీ‌వు‌డ్‌తో‌పాటు బాలీ‌వు‌డ్‌లో కూడా సల్మా‌న్‌ఖా‌న్‌లాంటి హీరోల్తో నటిం‌చిన రంభ కొంత‌కాలం స్పెషల్‌ సాంగ్స్‌లో తళు‌క్కు‌మన్న సంగతి తెలి‌సిందే.‌ తాజాగా కమె‌డి‌యన్‌ సప్త‌గిరి కథా‌నా‌య‌కు‌డిగా తెర‌కె‌క్కు‌తున్న సిని‌మాలో రంభ ఒక ప్రత్యేక పాత్రలో నటించే అవ‌కా‌శా‌లు‌న్నా‌యని తెలు‌స్తోంది.‌ ‌‘సిద్ధూ ఫ్రం శ్రీకా‌కుళం’‌ ఫేమ్‌ ఈశ్వర్‌ ఈ సిని‌మాని రూపొం‌ది‌స్తు‌న్నట్లు సమా‌చారం.‌

ఇలా చెప్పు‌కుంటూ పోతే నాటి తారలు నేడు కూడా తమ‌దైన బ్రాండ్‌ ఇమే‌జ్‌తో హల్‌చల్‌ చేస్తూ సినిమా విజ‌యా‌నికి ఇతో‌ధి‌కంగా చేయూ‌త‌ని‌స్తు‌న్నారు.‌ కృష్ణ‌వంశీ దర్శ‌క‌త్వంలో తెర‌కె‌క్కిన ‌‘చంద్రలేఖ’‌ సిని‌మాలో ఓ హీరో‌యి‌న్‌గా నటిం‌చిన ఇషా కొప్పి‌కర్‌ ఇటీ‌వల నిఖిల్‌ సిద్ధార్థ్, రీతూ‌వర్మ హీరో‌హీ‌రో‌యి‌న్లుగా తెర‌కె‌క్కిన ‌‘కేశవ’‌ సిని‌మాతో మళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల్ని పల‌క‌రిం‌చింది.‌ అదే‌బా‌టలో ఆమని, భాను‌ప్రియ, రమ్య‌కృ‌ష్ణ‌లాంటి ఎంతో‌మంది తారలు ఇప్ప‌టికీ సిని‌మాల పట్ల తమ అభి‌రు‌చిని చాటు‌కు‌న్నారు.‌ సావిత్రి జీవిత కథ ఆధా‌రంగా కీర్తి సురేష్‌ నటి‌స్తున్న ‌‘మహా‌నటి’‌ చిత్రంలో దివ్య‌వాణి కీర్తి సురేష్‌ తల్లిగా నటి‌స్తోంది.‌ అంతకు ముందు కొన్ని సీరి‌య‌ల్స్‌లో కూడా ఈమె నటిం‌చారు.‌ అల‌నాటి తార దేవ‌యాని కూడా మహే‌ష్‌బాబు హీరోగా వచ్చిన ‌‘నాని’‌ చిత్రంలో తల్లి‌పా‌త్రలో కని‌పిం‌చారు.‌ నాటి తరం ప్రేక్ష‌కుల్ని తన నట‌నతో మంత్రము‌గ్దుల్ని చేసిన కళా‌భి‌నేత్రి వాణిశ్రీ కూడా కొన్ని సిని‌మాల్లో కని‌పిం‌చారు.‌
−‌ పి.‌వి.‌డి.‌ఎస్‌.‌ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.