ఓట్ల పండగలో సినీతారల హంగామా
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినీ ప్రముఖులు గురువారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, సుధీర్‌బాబు, మాధవన్‌, ఎంఎం కీరవాణి తదితరులు ఓటు వేసిన అనంతరం దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అందరూ వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా కోరారు.


రాజమౌళి: మా యూనిట్‌ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ స్వస్థలాలకు వెళ్లారు. మీరు కూడా ఓటు వెయ్యండి. ఒకవేళ ఏ పార్టీ, రాజకీయ నాయకుడు మీకు మంచి చేయలేరు అనిపిస్తే.. కనీసం నోటాకైనా ఓటెయ్యండి.


నాగార్జున
: మన నేతలను ఎన్నుకుని, ప్రజాస్వామ్యాన్ని సెలబ్రేట్‌ చేసుకునే అవకాశం ప్రతి ఐదేళ్లకొకసారే వస్తుంది. ఇది ఓటేసే సమయం.


ఎన్టీఆర్‌
: మేం ఓటేశాం.. మరి మీరు?


సుధీర్‌బాబు
: నా డ్యూటీ పూర్తైంది. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన రోజుని వృథా చేసుకోకండి. ఇప్పుడే వెళ్లి ఓటు వెయ్యండి.


అల్లు అర్జున్
: ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఓటు హక్కు వినియోగించుకోవడం. ఇది మన భవిష్యత్తు, బాధ్యత. ఓటు వేసే వారికి అడిగే హక్కు ఉంటుంది. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.


ఎంఎం కీరవాణి
: ఉదయాన్నే వెళ్లి ఓటేశాను. వడదెబ్బ నుంచి తప్పించుకున్నాను.


మాధవన్‌
: ఓటెయ్యండి. ఇది మన దేశం. మనమే బాగుచేసుకోవాలి. కాస్త ఆలోచించి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. ఏం చేయాలో మీకు తెలుసుగా..


నాని:
 మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి.


ఉపాసన: ఇది మీ హక్కు. బాధ్యతగల పౌరులుగా ఉండండి.సాయి ధరమ్‌ తేజ్‌: వెళ్లండి.. ఓటు హక్కును వినియోగించుకోండి.


మంచు మనోజ్‌: చెడు రాజకీయ నాయకులను ఓటు వెయ్యని మంచి ప్రజలే ఎన్నుకుంటున్నారు. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.