‘హే రామ్‌’కి ఇరవై సంవత్సరాలు!

శవతారాల నటుడు కమల్‌హాసన్‌కు వైవిధ్యభరితమైన చిత్రాలు తియ్యడం, నటించడంలో ఉన్న అభిరుచే వేరు. అలా ఆయన రూపొందించిన చిత్రాల్లో ఒకటి ‘హే రామ్‌’. చంద్రహాసన్, చారుహాసన్‌ నిర్మాతలుగా, కమల్‌హాసన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18, 2000 నాడు విడుదలైంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా రాణీ ముఖర్జీ నటించింది. ఇందులో మహత్మాగాంధీగా నషీరుద్దీన్‌ షా, అమ్జాద్‌ అలీఖాన్‌గా షారుక్‌ ఖాన్‌ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. కమల్‌ హాసన్‌ సాకేత్‌ రామ్‌గా ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన సినిమాకి ఇలయరాజా సంగీతం హైలట్‌గా చెప్పుకోవచ్చు. హిందీ, తమిళంలో ఫిబ్రవరి 18, 2000న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.