వెండి తెరపై ‘ప్రేమ’ సంతకం

గుట్టుగా చిన్ని గుండెలోకి చెప్పకుండా చేరుతుంది ప్రేమ.

తియ్యనైన తిప్పలెన్నో పెడుతుంది ప్రేమ.

ప్రేమ ఫలానా మనిషి మీద ఫలానా సమయంలో పుడుతుందని చెప్పలేం. తొలిచూపు ప్రేమ కథలు కొన్నైతే.. పరిచయం తర్వాత మొదలయ్యే లవ్‌ స్టోరీస్‌ మరికొన్ని. నిజ జీవితాల్లోనే కాదు పుస్తకాల్లో, సినిమాల్లోనూ ప్రేమ అనే పదం కనపడితే ఆ క్షణం ఆగిపోవాల్సిందే. ఒక సంవత్సరంలో విడుదలయ్యే చిత్రాల్లో సగానికిపైగా ప్రేమకథలు విడుదలవుతున్నాయంటే ప్రేమ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. దర్శకులు ఎన్ని సార్లు తీసినా, నాయకానాయికలు ఎన్ని సార్లు నటించినా, ప్రేక్షకులు ఎన్నిసార్లు చూసినా.. బోర్‌ కొట్టని ఏకైక సబ్జెక్ట్‌ ప్రేమ. తమ ప్రేమకథా చిత్రానికి ‘ప్రేమ’అనే పదం వచ్చేలా టైటిల్‌ పెట్టాలని దర్శకనిర్మాతలు భావించినా ఒక్కోసారి కుదరదు. ఇలాంటి సమయంలో వేరే పేరు ఖరారు చేస్తుంటారు. కానీ, అప్పుడప్పుడు ‘ప్రేమ’ అనే రెండు తెలుగు అక్షరాలు ఉంటేనే కథకు న్యాయం జరుగుతుంది. అలా తెలుగు తెరపై ‘ప్రేమ’ను పంచుకున్న కొన్ని చిత్రాల టైటిల్స్‌ చూద్దామా...


*ప్రేమికుల రోజు

*ప్రేమదేశం

*ప్రేమకు వేళాయరా!

*ప్రేమంటే ఇదేరా

*ప్రేమించుకుందాం రా

*తొలిప్రేమ

*ప్రేమ

*ప్రేమ పిచ్చోళ్లు

*ప్రేమ నాటకం

*నిన్నే ప్రేమిస్తా

*ప్రేమతో రా

*ప్రేమపావురాలు

*ప్రేమాభిషేకం

*ప్రేమనగర్‌

*ప్రేమకావాలి

*ప్రేమకథా చిత్రం

*హలో గురు ప్రేమకోసమే

*ప్రేమజంట

*కృష్ణగాడి వీర ప్రేమ గాథ

*నాలో ఉన్న ప్రేమ

*ప్రేమఖైదీ

*ప్రేమ ఇష్క్‌ కాదల్‌

*ఎందుకంటే ప్రేమంట

*ప్రేమ సందడి

*ప్రేమకు స్వాగతం

*ప్రేమ ఒక మైకం

*30 రోజుల్లో ప్రేమించడం ఎలా

*ప్రేమలో పావని కల్యాణ్‌

*ప్రేమికుడు

*లవర్‌

*లవర్స్‌

*వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌

*లవ్‌ స్టోరీ

*100% లవ్Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.