ఇరవైఐదు సంవత్సరాల ‘ప్రేమికుడు’

ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా హరోగా, నగ్మా కథానాయికగా వచ్చిన తమిళ అనువాద చిత్రం ‘ప్రేమికుడు’. ఈ చిత్రాన్ని తమిళంలో ‘కాదలన్‌’ పేరుతో సెప్టెంబర్‌ 17, 1994న విడుదల చేశారు. సినిమా తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసుకొంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన పాటలు వింటుంటే చాలా కొత్తగా ఉంటాయి. ఏ.ఆర్‌.ఎస్‌.ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఎస్‌.శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. కే.టి.కుంజు మోహాన్‌ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో కుంజుమోహాన్‌ తమిళంలో ‘కాదల్‌ దేశమ్‌’ చిత్రం తీశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమదేశం’గా వచ్చి అలరించింది. ‘ప్రేమికుడు’ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలు ‘ఊర్వశి..ఊర్వశి..’, ‘ఎర్రాని కుర్రాదాన్ని గోపాల..’, ‘అందమైన ప్రేమరాణి చేయి తగలితే..’లాంటి పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. ‘ప్రేమికుడు’ సమయానికి ప్రభుదేవా వయసు ఇరవైఒక్కటి సంవత్సరాలు, నగ్మాకి పందొమ్మిది సంవత్సరాలు కావడం గమనార్హం. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో అల్లు రామలింగయ్య, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, గిరీùకర్నాడ్, రఘువరన్, వడివేలు, మనోరమ తదితరులు నటించారు. నేటికి ఈ చిత్రం విడుదలై ఇరవైఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.