గెలుపు కోరేవాడు మనిషి.. గెలుపు పంచేవాడు ‘మహర్షి’

                                 

‘‘గెలుపు కోరే వాడు మనిషి.. ఆ గెలుపును పంచే వాడు మహర్షి’’ అంటూ తన 25వ చిత్రంతో బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటుతున్నాడు మహేష్‌బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దిల్‌రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. అల్లరి నరేష్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, జయసుధ, ప్రకాష్‌ రాజ్, రావు రమేష్‌ తదితరులు కీలక ప్రాతల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి సత్తా చాటింది. విజయానికి అసలర్థాన్ని.. స్నేహంలోని గొప్పతనాన్ని.. మనిషి జీవితంలో వ్యవసాయ రంగ ప్రాముఖ్యాన్ని, రైతన్నలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇలా అనేక అంశాల్ని ‘మహర్షి’ చిత్రంతో ఎంతో చక్కగా ప్రేక్షకుల మదికి హత్తుకునేలా చూపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రంలోని సంభాషణలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన డైలాగ్స్‌ను ‘సితార.నెట్‌’ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం..



















Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.