పదమూడేళ్ల ‘మున్నా’

‘‘మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా.. మనసే నీకేదో చెప్పాలందమ్మా.. నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా’’ అంటూ సాగే ఈ మనసు పాట వింటుంటే కుర్రవయసు ఎదో తెలియని ఆరాటాన్ని చెప్పాలని తొందర చేస్తున్నట్లుంది. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్, ఇలియానా కలిసి నటించిన చిత్రం ‘మున్నా’ గుర్తుకొస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో యాక్షన్‌-క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 27, 2007లో విడుదలై అలరించింది. ప్రభాస్‌ ఇందులో కాలేజీ కుర్రాడిగా నటించగా, మాఫియా డాన్‌గా ప్రకాష్‌ రాజ్‌ నటించాడు. ఇందులో కోట శ్రీనివాసరావు ఓ నిజాయితీగల రాజకీయనాయకుడి పాత్రలో కనిపిస్తాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్, రాహుల్‌ దేవ్, పోసానితో పాటు హాస్యనటులు వేణుమాధవ్, రఘుబాబులు నటించారు. వంశీ పైడిపల్లితో పాటు కొరటాల శివ కథను సమకూర్చాడు. హరీష్‌ రాజ్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.