రవితేజ పేల్చిన పంచ్‌లు
‘మాస్‌ అంటే బస్‌ పాస్‌ కాదు బే. ఎవరు పడితే వాడు వాడేసుకోనీకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్‌ను బట్టి జనం పిలుచుకునే పిలుపు’ అని ఓ సినిమాలో తన గురించే తానే రవితేజ చెప్పిన డైలాగ్‌. తనేంటో నిరూపించుకున్నాడు కాబట్టే అలా చెప్పుకున్నాడు. మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారడమే కాదు ప్రేక్షకుల చేత ‘మాస్‌ మహారాజ్‌’ అనిపించుకున్నాడు. కామెడీతో ఎంతగా అలరిస్తాడో, పంచ్‌ డైలాగ్‌ చెప్పి అంతకన్నా ఎక్కువగా వినోదం పంచుతాడు. ఈయన నోటి నుంచి పంచ్‌ బయటకొస్తే థియేటర్లలో విజిల్స్‌ తప్ప ఏం వినపడదు. అలాంటి డైలాగ్స్‌ కొన్ని..


*
పవర్‌: ‘‘వార్నింగులు, వారెంట్లు, జైళ్లు, బెయిల్‌ ఉండవ్‌. ఒక్క బుల్లెట్‌ కూడా వేస్ట్‌ అవ్వదు. ఏసీపీ బలదేవ్‌’’

*
ఆంజనేయులు:
‘‘హిరోషిమా, నాగసాకి పేర్లు విన్నావా? ఎప్పుడో 60 ఏళ్ల కిత్రం అమెరికా అణుబాంబు వేస్తే ఇప్పటికీ కోలుకోలేదు. దాని పేరు అణుబాంబు, నా పేరు ఆంజనేయులు. పేర్లే తేడా, పవరొకటే. ఇప్పుడు నిన్ను కొడితే, నీకు పుట్టే వాడికి, వాడికి పుట్టేవాడికి కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయ్‌’’.

- ‘‘సాధారణంగా నాకు ఎవరి మీద చెయ్యి వేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే నా చెయ్యి కూడా నా మాట వినదు. నా బాడీలో పార్ట్స్‌కి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. దేని పని అది చేసుకుపోద్ది. నేను డిసైడ్‌ అవ్వటమే.. డిలే ఉండదు’’.

* నేనింతే: ‘‘అన్నా! తుడుచుకుంటే పోతుందనుకుంటే నూటికి తొంభై తొమ్మిది సార్లూ నేను తుడుచుకుంటానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నవ్వు పోతావ్‌’’.

* ఇడియట్‌: ‘‘కమిషనర్‌ కూతురు అని చెప్తే భయపడిపోతామా? కమిషనర్ల కూతుళ్లని ప్రేమించకూడదా? కమిషనర్ల కూతుళ్లకి భర్తలు రారా’’.

- ‘‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. చంటిగాడు ఎపుడూ ఇక్కడే ఉంటాడు. లోకల్‌’’.

* విక్రమార్కుడు: ‘‘నాకు భయం లేదని ఎందుకనుకుంటున్నారు సర్‌. ఎప్పుడో ఒక్కసారి కాదు రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా సర్‌. నాలుగేళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణమైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సర్‌. మీకు చెప్పిన తలుపు చప్పుళ్లు, ఫోన్‌ రింగులు రావొచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు కచ్చితంగా వచ్చి తీరుతుంది సర్‌. ఆ రోజు దాన్ని కళ్లలోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సర్‌. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్‌లో ఉంటుంది సర్‌. దానికి ఒకటే కోరిక సర్‌.. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లలో బెరుకు ఉండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం ఉండాలి సర్‌’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.