పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి!

ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ భారతదేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా కొంతమంది బాలీవుడ్‌ నటీమణులు రనీనా టాండన్, సమీరె రెడ్డి, ప్రస్తుత నటి-నిర్మాత సన్నీ లియోనీ కరోనా వైరస్‌ భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

  • రవీనా టాండన్‌: ‘‘ఇంటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చేతులు కడుక్కోవడంతో పాటు మనల్ని మనం స్వీయనిర్భందించుకోవాలి. ప్రస్తుతం స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. పిల్లలంతా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతారు. వారితో ఇప్పుడు చాలా ఎక్కువ సమయాన్ని కెటాయిస్తున్నాం. ఇంకా కొన్ని ఆటలు కూడా ఆడుతున్నాం. మా అమ్మాయి రాషా, అబ్బాయి రణ్‌బీర్‌తో ఎక్కువసేపు గడపగలుగుతున్నాను’’.    

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

  • సన్నీ లియోనీ: ‘‘ముసుగులు ధరించి గడపడం చాలా విచారకరం. పసిపిల్లలకు మాస్క్‌లు వేసి ఉంచడం బాధగా ఉంది. అయినా ఈ సమయాన్ని పిల్లలకి కొత్త విషయాలు నేర్పడానికి ఉపయోగించండి. వారి సమయాన్ని బిజీగా ఉండేలా చూడాలి’’.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

  • సమీరా రెడ్డి: ‘‘మా అబ్బాయి హాన్స్‌ నా వద్దకు వచ్చి కరోనా అంటే ఏమిటని అడిగినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఈ పరిస్థితి గురించి పిల్లలు కూడా ఆందోళనలలో ఉన్నారు. వాళ్లకు అర్థమయ్యేలా వివరించాను. త్వరలోనే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అని నమ్ముతున్నా’’.

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.