వీళ్లూ యాక్షన్‌ చెప్పారు... వినోదం పంచారు
తెలుగు సినిమా తన రూపు రేఖలు మార్చుకుంటుంది. ఫైట్లు, కామెడీ ఉంటేనే హిట్‌ అవుతుందనే ఫార్ములాని వదిలి సరికొత్త కథల వైపు అడుగేస్తోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకున్న సినిమాలే ఇందుకు ఉదాహరణ. కొత్త డైరెక్టర్లు ప్రయోగాలతో మంచి ఫలితాలు అందుకుంటున్నారు. పాత దర్శకులు సైతం ఈ పోటీనీ తట్టుకోలేని తరుణంలో మహిళల దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాలు నిలబడగలవా అనేది ప్రశ్న. ‘ఓ బేబీ’ చిత్రం ఇదే కోవలోకి వస్తుంది. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’ని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు దర్శకురాలు నందిని రెడ్డి ముందుకొచ్చింది. ఆమెకు సత్తా ఉందని తను గతంలో తీసిన సినిమాలే సమాధానం ఇస్తాయి. ఈ నేపథ్యంలో దర్శకత్వం వహించిన మహిళలను, వారి తీసిన సినిమాలను గర్తుచేసుకుందాం..


24 క్రాఫ్ట్‌లు సమన్వయంగా పనిచేస్తేనే ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. అందులో ఏ ఒక్క విభాగం సరిగా లేకపోయినా అనుక్ను ఔట్‌పుట్‌ రాదు. ఈ అన్ని విభాగాల్ని ఓకే తాటిపై నిలిపి ఊహకు ప్రాణం ఇచ్చేవాడు వాడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ని ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌’ అంటారు. డైరెక్టర్‌కు యాక్షన్‌.. అని చెప్పడం తేలికే అవ్వొచ్చు కానీ తాను అనుకున్న విధంగా నటీనటులతో యాక్టింగ్‌ చేయించడం కత్తి మీద సామే. అందుకే తెరమీద దర్శకుడు అని కనిపించేది, తెరవెనక దర్శకుడు అని వినిపించేది తప్ప దర్శకురాలు అని కనడమో, వినడమో లేదు. మగాళ్లు మాత్రమే ఆధిపత్యం చలాయించే ఈ విభాగంలో మహిళలు ప్రవేశించడం అసాధ్యమయ్యేది. అది అవాస్తమంటూ.. మేమూ దర్శకత్వం చేయగలమని ఆనాడే నటి విజయ నిర్మల, భానుమతి, సావిత్రి లాంటి వాళ్లు నిరూపించారు. అదే స్ఫూర్తితో తర్వాతి తరం వారు సాగారు.

* జీవితరాజశేఖర్‌: హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో అలరించిన జీవిత.. రాజశేఖర్‌ హీరోగా ‘శేషు’ చిత్రానికి దర్శకత్వం వహించింది.*
బి.జయ: ‘చంటిగాడు’, ‘లవ్లీ’ సినిమాలను తెరకెక్కించారు.


*
సుచిత్రాచంద్రబోస్‌: కొరియోగ్రాఫర్‌గా సుపరిచితురాలైన సుచిత్ర రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘పల్లకిలో పెళ్లికూతురు’ చిత్రంతో దర్శకురాలిగా మారారు.


*
మంజుల ఘట్టమనేని: ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.


*
సంజనారెడ్డి: ‘రాజుగాడు’ చిత్రానికి దర్శకురాలు.


*
మధుమిత: ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’ చిత్రాన్ని అందించారు.


*
శశికిరణ్‌ నారాయణ: ‘సాహెబా సుబ్రహ్మణ్యం’


*
చునియా: ‘పడేశావే’

* శ్రీప్రియ: ‘దృశ్యం’


*
సుధా కొంగర: తమిళం, తెలుగు భాషల్లో ‘గురు’ సినిమాకు దర్శకత్వం వహించారు.


*
నందిని రెడ్డి: ‘అలా మొదలైంది’ చిత్రంతో తన ప్రస్థానం మొదలుపెట్టి ‘జభర్తస్త్‌’, ‘కల్యాణ వైభోగమే’ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం ‘ఓ బేబీ’తో తన పంథా కొనసాగించనుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.