32 సంవత్సరాల కె.విశ్వనాథ్‌ స్వర్ణకమలం

విక్టరీ వెంకటేష్‌, నాట్యమయూరి భానుప్రియ కలిసి నటించిన చిత్రం ‘స్వర్ణకమలం’. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత చిత్రం విడుదలై నేటికి (జులై 15) 32 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని ప్రతి పాట ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ‘‘ఆకాశంలో ఆశల హరివిల్లూ..ఆనందాలే పూసిన పొదరిళ్ళూ.. అందమైనా ఆ లోకం ఆందుకోనా..ఆదమరిచీ కలకాలం ఉండిపోనా’’, ‘‘ఘల్లు ఘల్లు ఘల్లుమంటు.. మెరుపల్లే తుళ్ళు.. ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు’’ ఇలా ఎన్నో పాటలు ఈనాటికి బుల్లితెరపై, ఎఫ్‌ఎమ్‌ల్లోనూ వినిస్తూనే ఉన్నాయి. సిరివెన్నెల గీతాలకు ఎస్పీ బాలు, సుశీల, జానకిలు గాత్రాలు తోడవ్వగా ఇళయరాజా సంగీం తెలుగు ప్రేక్షకులను అలరించి మెప్పించింది. కె.ఎస్‌.రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి సి.హెచ్‌.వి.అప్పారావు నిర్మాతగా వ్యవహరించారు. చిత్రానికి మూడు నందిఅవార్డులతో పాటు వెంకటేష్‌కి పత్యేక జ్యూరీ అవార్డు లభించగా, భానుప్రియ ఉత్తమనటిగా అవార్డు గెలుచుకుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.