‘సైమా’ అవార్డు అందుకునేదెవరో?

సినిమా.. ఓ రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో అడుగుపెట్టాలని ఎందరో కలలు కంటుంటారు. కొందరు మాత్రమే ఆ కలల్ని సాకారం చేసుకుంటారు. ఇందులో ప్రేక్షకులకు వినోదం పంచడమే వారి పని. దానికోసం ఒక్కో నటుడు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటాడు. సినిమా హిట్‌ అయినా ప్లాప్‌ అయినా పట్టించుకోకుండా తమ అభిమానులకు కొత్తదనం చూపించాలనే ఉద్ధేశంతో నిరంతరం శ్రమిస్తాడు. ఇక్కడ వసూళ్లు రాబట్టడమే వారి ధ్యేయం కాదు, అందుకే విమర్శలు ఎదురైనా నిలబడి ప్రయోగాలు చేసి అవార్డులు సంపాదిస్తారు. ‘సైమా’ (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) ఇందుకు వేదికగా నిలుస్తుంది. తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ చిత్రాలకు సంబంధించి కొన్ని ఉత్తమ చిత్రాలు, నటీనటులను గుర్తించి ప్రతి సంవత్సరం అవార్డుల వేడుక నిర్వహిస్తుంది. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు,సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలో అవార్డులు ఇవ్వడమే కాకుండా సినీ రంగానికి సేవ చేసిన ప్రముఖులను సత్కరిస్తారు. ఈ సారి ఖతార్‌లోని దోహాలో ఆగస్టు 15,16న ఈ ఉత్సవం జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నామినేట్‌ అయిన చిత్రాలు, నటీనటుల వివరాలివి..

* ఉత్తమ చిత్రం



* ఉత్తమ దర్శకుడు


* మోహన కృష్ణ ఇంద్రగంటి (సమ్మోహనం)
* పరశురామ్‌ (గీత గోవిందం)
* నాగ్‌ అశ్విన్‌ (మహానటి)
* సుకుమార్‌ (రంగస్థలం)
* త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (అరవింద సమేత వీర రాఘవ)




* ఉత్తమ నటుడు


* దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి)
* మహేశ్‌ బాబు (భరత్‌ అనే నేను)
* ఎన్టీఆర్‌ (అరవింద సమేత వీర రాఘవ)
* రామ్‌ చరణ్‌ (రంగస్థలం)
* సుధీర్‌బాబు (సమ్మోహనం)
* విజయ్‌ దేవరకొండ (గీతగోవిందం)




* ఉత్తమ నటి


* అదితి రావ్‌ హైదరీ (సమ్మోహనం)
* అనుష్క (భాగమతి)
* కీర్తి సురేష్‌ (మహానటి)
* రష్మిక మందాన (గీత గోవిందం)
* సమంత (రంగస్థలం)




 * ఉత్తమ ప్రతినాయకుడు


* జగపతిబాబు (రంగస్థలం)
* జయరామ్‌ (భాగమతి)
* కునాల్‌ కపూర్‌ (దేవదాస్‌)
* మాధవన్‌ (సవ్యసాచి)
* శరత్‌కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)




* ఉత్తమ సహాయ నటుడు


* ఆది పినిశెట్టి (రంగస్థలం)
* మురళీశర్మ (విజేత)
* రాజేంద్ర ప్రసాద్‌ (మహానటి)
* నరేష్‌ (సమ్మోహనం)
* రాంకీ (ఆర్‌ ఎక్స్‌100)



*ఉత్తమ సహాయ నటి

* అనసూయ (రంగస్థలం)
* ఆశా శరత్‌ (భాగమతి)
* జయసుధ (శ్రీనివాస కల్యాణం)
* రమ్యకృష్ణ (శైలజారెడ్డి అల్లుడు)
* సుప్రియ (గూఢచారి)



*ఉత్తమ సంగీత దర్శకుడు


* చైతన్‌ భరద్వాజ్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
* దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
* గోపీ సుందర్‌ (గీత గోవిందం)
* మిక్కీ జే మేయర్‌ (మహానటి)
* ఎస్‌.ఎస్‌.తమన్‌ (అరవింద సమేత వీర రాఘవ)




*ఉత్తమ హాస్య నటుడు


* సత్య (ఛలో)
* పృథ్వీ (శైలజారెడ్డి అల్లుడు)
* సునీల్‌ (అమర్‌ అక్బర్‌ ఆంటోనీ)
* వెన్నెల కిషోర్‌ (చి.ల.సౌ.)
* విష్ణు (ట్యాక్సీవాలా)

*ఉత్తమ గీత రచయిత

* అనంత్‌ శ్రీరామ్‌ (ఇంకే.. ఇంకే కావాలే-గీత గోవిందం)
* చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నావే -రంగస్థలం)
* కృష్ణకాంత్‌ (మాటే వినదుగా-ట్యాక్సీ వాలా)
* రామజోగయ్య శాస్త్రి (పెనివిటి -అరవింద సమేత)
* సిరివెన్నెల సీతారామశాస్త్రి (మూగ మనసులు-మహానటి)

*ఉత్తమ గాయకుడు

* అనురాగ్‌ కుల్‌కర్ణి (పిల్లారా.. -ఆర్‌ఎక్స్‌ 100)
* కాల భైరవ (పెనివిటి - అరవింద సమేత)
* కైలాష్‌ ఖేర్‌ (వచ్చాడయ్యో సామీ - భరత్‌ అనే నేను)
* రాహుల్‌ శిపిలిగంజ్‌ (రంగా.. రంగా.. -రంగస్థలం)
* సిద్‌ శ్రీరామ్‌ (ఇంకే.. ఇంకే కావాలే -గీత గోవిందం)

*ఉత్తమ గాయని

* చిన్మయి (ఏంటీ.. ఏంటీ - గీత గోవిందం)
* మానసి (రంగమ్మ మంగమ్మ -రంగస్థలం)
* శ్రేయా ఘోషల్‌ (అల్లసాని వారి-తొలిప్రేమ)
* శ్రేయా గోపరాజు (టిక్‌ టిక్‌ టిక్‌ -సవ్యసాచి)
* సునీత ( చివరకు మిగిలేది -మహానటి)

*ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌

* డానీ సెలజ్‌లోపేజ్‌ (మహానటి)
* జార్స్‌ సి విలియమ్స్‌ (తొలిప్రేమ)
* జేకే (పడి పడి లేచె మనసు)
* రత్నవేలు (రంగస్థలం)
* షానియల్‌దేవ్‌ (గూఢచారి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.