అత్తల గురించి సినీ కోడళ్ల కబుర్లు!
సహజంగా ఏ ఇంట్లోనైనా అత్తాకోడళ్లంటే ఏవే తగాదాలు, చిన్నచిన్న పొరపాట్లు తలెత్తుంటాయి. కానీ అలాంటి తగాదాలు మామధ్య ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు బాలీవుడ్‌ తారలు రాణీ ముఖర్జీ, జూహ్లీ చావ్లా, సోనమ్‌ కూపూర్‌. తాజాగా నటి విద్యాబాలన్‌ ‘డున్‌ బాదల్‌ కే తో దేఖో’ అనే ఓ ప్రవేట్‌ రేడియో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటీమణులు అత్తమ్మల గురించి చెబుతున్న కొత్త కబుర్లు...


నటి రాణీ ముఖర్జీ మాట్లాడతూ..‘‘మా అత్త ఒక అద్భుతమైన వ్యక్తి, ఆమె ప్రతి రోజు ఆమె ఏదో కొత్త విషయాన్ని చెబుతుంటారు. ఇంట్లో అందరిని చాలా బాగా చూసుకుంటారు. ఇలాంటి అత్తమ్మను ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేన’’ని చెబుతోంది.

మరో సీనియర్‌ నటి జూహీచావ్లా తన అత్త గురించి చెబుతూ..‘‘ఒక సారి నేను అవుట్‌డోర్‌ షూటింగ్‌ కోసం పదిరోజుల పాటు ఇంటికి దూరంగా ఉన్నా. కొంచెం పిల్లలను చూసుకోండి అని అడిగాను. అప్పుడు అత్తగారు వెంటనే ఒప్పేసుకుంది. నేనొచ్చేంత వరకూ పిల్లల ఆలనాపాలనా అంతా ఆమే చూసుకొంది. ఆమె ఎక్కువగా ఉగండా దేశంలో ఉంటారు. అయినా మా కోసం ఆమె విమానా ప్రయాణాలు చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చాలా కష్టమైన కుటుంబ బంధాల కోసం అవన్నీ సహనంతో చేశారు. ఆమె గొప్ప అత్తమ్మ అని’’ చెప్పగలను.

ఇక గత ఏడాది కొత్తగా అత్తగారింట్లో అడుగుపెట్టిన సోనమ్‌ కపూర్‌ తన అత్త ప్రియా అహుజా గురించి చెబుతూ.. ‘‘అత్త అని పిలిచే కంటే అమ్మ అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే ఆమే ఓ సారి నాకు చెబుతూ ‘ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలు. నీతో కలిపితే ముగ్గురవుతార’ని చెప్పింది. ఆ మాట విన్న తరువాత నాకు కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయింది. అందుకే అత్తగారనేది బదులు అమ్మ..అని పిలవడం ఉత్తమం’’అంటోంది. 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.