తేనె కళ్ల సుందరి.. రాణీముఖర్జీ
ఒకరు అందానికి ఐకాన్‌లా కని‌పి‌స్తుం‌టారు. ఆ గుర్తిం‌పుతోనే అవ‌కా‌శాలు అంది‌పుచ్చు‌కొం‌టుం‌టారు. మరొ‌క‌రేమో నట‌నకి పెట్టింది పేరు అనే ప్రశం‌సలు పొందు‌తుం‌టారు. ఆ కేట‌గి‌రీలో కొన్ని కథ‌లని రిజర్వ్‌ చేసు‌కొం‌టారు. రాణీ‌ము‌ఖర్జీని మాత్రం అలా ఒక ఒరలో ఇమ‌డ్చలేం. అబ్బ... ఈ సిని‌మాలో ఎంత అందంగా కని‌పించింది అని ముచ్చ‌ట‌ప‌డేలోపు... మరో సిని‌మాలో అందుకు పూర్తి భిన్నంగా కని‌పిస్తుం‌టుంది. అందరూ అను‌కొం‌టు‌న్న‌ట్టుగా కథల ఎంపి‌కలో లోపమో లేదంటే ప్రయో‌గాలు చేయా‌లన్న ఉత్సు‌కత వల్లో తెలి‌యదు కానీ... రాణీ‌ము‌ఖర్జీ నట ప్రయాణం అంత సాఫీగా ఏం సాగ‌లేదు. ఒక విజయం దక్కితే ఆ వెంటనే పది పరా‌జ‌యాలు వెంటా‌డాయి. అయినా సరే... ఆమె వరు‌సగా అవ‌కా‌శా‌లను అంది‌పు‌చ్చుకొంది. స్టార్‌ కథా‌నా‌య‌కులతో ఆడి‌పా‌డింది. ఇర‌వ‌య్యే‌ళ్లుగా చిత్ర పరి‌శ్రమలో కొన‌సా‌గు‌తోంది. విమ‌ర్శ‌కుల మెప్పు పొందిన ఓ మంచి నటి... రాణీ‌ము‌ఖర్జీ. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘సాథియా’, ‘బ్లాక్‌’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘తలాష్‌’ లాంటి చిత్రా‌లతో ప్రేక్ష‌కుల మన‌సులు దోచుకుంది రాణి. నీలి‌కళ్లు, గమ్మత్తైన గొంతు, చెర‌గని చిరు‌నవ్వు... ఈమె అందా‌నికి ఆభ‌ర‌ణాలు. ముఖర్జీ నట ప్రయాణం గురించి కొన్ని విష‌యాలు...


* బెంగాలీ భామ..
సినిమాతో అను‌బంధ‌మున్న బెంగాలీ కుటుం‌బంలో పుట్టి పెరి‌గింది. తండ్రి పేరు రామ్‌ముఖర్జీ. బెంగా‌లీలో పలు చిత్రాల్ని రూపొం‌దిం‌చిన దర్శకుడీ‌యన. ఫిల్మా‌లయ అనే స్టూడియోని కూడా స్థాపిం‌చారు. తల్లి క్రిష్ణ ముఖర్జీ సినీ నేప‌థ్య‌గా‌యని. రాణికి ఓ సోదరుడున్నారు. ఆయన పేరు రాజా ముఖర్జీ. దర్శ‌కు‌డిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చు‌కొన్నాడు. 1978 మార్చి 21న ముంబ‌యిలో జన్మిం‌చింది రాణి.

* కాజోల్‌ చెల్లి...
బాలీ‌వుడ్‌ కథానా‌యిక కాజోల్‌కి కూడా రాణి‌ము‌ఖర్జీ దగ్గర బంధువు. రాణి తెర ప్రవే‌శంలోనూ, సినిమా అవ‌కా‌శాలు అందు‌కో‌వ‌డంలోనూ కాజోల్‌ స్ఫూర్తి, ప్రమేయం ఉందని బాలీవుడ్‌ వర్గాలు చెబు‌తుంటాయి. ప్రస్తుతం హిందీ చిత్ర పరి‌శ్రమలో స్క్రిప్ట్‌ రైట‌ర్‌గా, దర్శ‌కు‌డిగా గుర్తింపు తెచ్చు‌కొన్న అయన్‌ ముఖర్జీ కూడా రాణికి దగ్గర బంధువే.

* ఆసక్తి లేకుం‌డానే...
రాణి‌ము‌ఖర్జీకి ఊహ తెలి‌సి‌న‌ప్ప‌ట్నుంచీ చుట్టూ సినిమా వాతా‌వ‌ర‌ణమే. ఇంట్లోనే బోలె‌డంత‌మంది నటులు. దీంతో ఆమెకి సిని‌మాపై ఆసక్తే కల‌గ‌లే‌దట. అందరూ సిని‌మా‌ల్లోనే ఉన్నారు కాబట్టి... వేరే రంగంలోకి వెళ‌తా‌నని ఇంట్లో చెప్పే‌దట. అయితే ఆమె స్కూల్‌కి వెళు‌తున్న సమ‌యంలోనే అను‌కో‌కుండా... తన తండ్రి తీసిన ‘బయ్యర్‌ ఫూల్‌’ అనే ఓ బెంగాళీ చిత్రంలో చిన్న పాత్ర పోషిం‌చాల్సి వచ్చిం‌దట. అయి‌ష్టం‌గానే ఆ పాత్ర చేసిం‌దట. ఆ వెంటనే ఆమెకి అవ‌కా‌శాలు తలుపు‌త‌ట్టాయి.


* తొలి ప్రశంస..
1994లో సలీ‌మ్‌ఖాన్‌ అనే దర్శ‌కుడు ‘ఆ గలే లగ్‌జ’ అనే చిత్రం కోసం కథా‌నా‌యి‌కగా రాణి ముఖ‌ర్జీని ఎంపిక చేసు‌కో‌వా‌లని అను‌కొ‌న్నాడు. అయితే ఆమె తండ్రి వద్దని వారిం‌చ‌డంతో ఆ సిని‌మాలో నటిం‌చ‌లే‌క‌పో‌యింది. ఆ తర్వాత కొన్నా‌ళ్లకు మళ్లీ అదే దర్శకుడు ‘రాజాకి ఆయేగా బరాత్‌’ అనే ఓ చిత్రంలో రాణి కోసం ఓ పాత్ర రాసు‌కొ‌న్నారు. అదొక ప్రయో‌గా‌త్మక చిత్రం కావడంతో పాటు తల్లి ప్రోత్సాహం కూడా దక్క‌డంతో అందులో నటించింది. ఆ చిత్రం పెద్దగా విజయం సాధిం‌చ‌లేదు. అయితే రాణీముఖర్జీ నట‌నకి మాత్రం విమ‌ర్శకుల ప్రశం‌సలు దక్కాయి.

* చదువును ఆప‌లేదు..
సిని‌మాల్లో అవ‌కా‌శా‌లొ‌స్తు‌న్నా... మధ్య‌మ‌ధ్యలో నటి‌స్తున్నా... చదు‌వును మాత్రం ఆప‌లేదు. మానె‌క్‌జీ కూపర్‌ హై స్కూల్‌లో ప్రాథ‌మిక విద్యని అభ్య‌సిం‌చింది. ఎస్‌.‌ఎ‌న్‌.‌డి.టి. ఉమెన్స్‌ యూని‌వ‌ర్సిటీ నుంచి హోమ్‌సై‌న్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చు‌కుంది. పదో తర‌గ‌తి‌లోనే ఒడిస్సీ నృత్యంపై పట్టు సంపా‌దిం‌చింది. తల్లి కోరిక మేరకు... రోషన్‌ తనేజా యాక్టింగ్‌ ఇన్‌స్టి‌ట్యూ‌ట్‌లో చేరి నటన గురించి శిక్షణ తీసుకుంది.

* ఆమీ‌ర్‌ఖా‌న్‌తో..
రాణీ‌ము‌ఖ‌ర్జీకి తొలి కమ‌ర్షి‌యల్‌ విజ‌యాన్ని అందిం‌చిన చిత్రం అంటే... ‘గులామ్‌’ అనే చెప్పాలి. 1998లో ఆమీ‌ర్‌ఖాన్‌తో కలిసి ఈ చిత్రంలో నటిం‌చింది రాణి. ‘ఆతీ క్యా కండాలా...’ అనే పాటతో ఆ చిత్రం బాగా ప్రాచుర్యం పొందింది. రాణి‌ము‌ఖర్జీ ఇందులో పోషిం‌చింది చిన్న పాత్రే అయినా... బాలీవుడ్‌ పరి‌శ్రమ వర్గా‌లను, ప్రేక్ష‌కుల్ని బాగా ఆక‌ట్టు‌కుంది.

* పరా‌జ‌యాల పరం‌పర..
‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ తర్వాత ఆమెకి చాలా సినిమాలు చేదు ఫలి‌తాల్ని అందిం‌చాయి. ‘బదాల్‌’, ‘బిచ్చు’, ‘హర్‌ కర్‌ ది ఆప్నే’, ‘కహీ ప్యార్‌ నహో జాయే’, ‘హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా’... ఇలా రాణి నటిం‌చిన చాలా సిని‌మాలు పరా‌జయాన్ని చవి‌చూ‌శాయి. అదృ‌ష్ట‌మే‌మి‌టంటే... వీటిలో రాణి పోషిం‌చిన పాత్రలకు మాత్రం మంచి ప్రశంసలే దక్కా‌యి. అందుకే ఆమె కెరీ‌ర్‌కి పెద్దగా ఇబ్బం‌దులు ఎదు‌రు‌కా‌లేదు. మధ్యలో కమ‌ల్‌హా‌స‌న్‌తో చేసిన ‘హే రామ్‌’ చిత్రంలో నట‌నకుగానూ రాణి మరింత మంచి పేరు సంపా‌దిం‌చారు.


* యశ్‌రాజ్‌ సిని‌మా‌లతో...
బాలీవుడ్‌లో పేరె‌న్ని‌క‌గన్న నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థలో సిని‌మాలు చేయడం రాణీ‌ము‌ఖర్జీకి బాగా కలి‌సొ‌చ్చింది. 2002లో ఆ సంస్థలో ‘ముఝే దోస్త్‌ కరేగీ’, ‘సాథియా’ చిత్రాల్ని చేసింది రాణి. ‘ముఝే దోస్త్‌ కరేగీ’ సిని‌మాకి అంత‌ర్జా‌తీయ స్థాయిలో ఆద‌రణ లభిం‌చింది. అయితే లోకల్‌ మార్కె‌ట్‌లో మాత్రం ఈ చిత్రం ఆద‌రణ పొంద‌లే‌క‌పో‌యింది. ‘సాథి‌యా’లో రాణి నట‌నకు పలు పుర‌స్కా‌రాలు కూడా దక్కాయి. ఆ తర్వాత యశ్‌రాజ్‌ సంస్థలో మరిన్ని చిత్రాలు చేసింది రాణి.

* గొప్ప మలుపు..
రాణి ముఖ‌ర్జీకి మేలి మలు‌పు‌ని‌చ్చిన చిత్రం అంటే ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ అనే చెప్పాలి. 1999లో ప్రేక్షకుల ముందు‌కొ‌చ్చిన ఈ చిత్రంలో తన అక్క కాజోల్‌తో కలిసి తెరను పంచు‌కొంది రాణి. నిజా‌నికి ఈ సిని‌మాలో రాణి పాత్రని మొదట ట్వింకిల్‌ ఖన్నాని దృష్టిలో పెట్టు‌కొని రాసు‌కొ‌న్నాడు దర్శ‌కుడు కర‌ణ్‌జో‌హార్‌. అయితే ఆ పాత్రలో ట్వింకిల్‌ నటిం‌చ‌నని చెప్పే‌సిందట. ఆ తర్వాత పలు స్టార్‌ కథా‌నా‌యి‌క‌లను సంప్రదిం‌చాడు కర‌ణ్‌జో‌హార్‌. ఎవ్వరూ అందులో నటిం‌చేం‌దుకు ఒప్పు‌కో‌లేదు. చివ‌రికి రాణి ముఖర్జీ ముందు‌కొ‌చ్చింది. టీనా మల్హోత్రా అనే కళా‌శాల విద్యా‌ర్థిని పాత్రలో రాణి నటిం‌చింది. షారు‌ఖ్‌ని ప్రేమించే యువ‌తిగా ఆ పాత్రలో చక్కటి అభిన‌యాన్ని ప్రద‌ర్శిం‌చింది.

* బోలె‌డన్ని అవ‌కా‌శాలు..
సిని‌మాల ఫలి‌తాలు ఎలా ఉన్నా... రాణికి మాత్రం అవ‌కాశాలకి కొద‌వ‌లేదు. ఇప్ప‌టి‌దాకా ఆమె 70కిపైగా సిని‌మాలు చేసింది. ‘చల్‌తే చల్‌తే’, ‘చోరి చోరి’, ‘కల‌కత్తా మెయిల్‌’, ‘ఎల్‌.‌ఓ.‌సి.‌కా‌ర్గిల్‌’, ‘యువ’, ‘హమ్‌తుమ్‌’, ‘వీర్‌జారా’, ‘బ్లాక్‌’, ‘బంటీ ఔర్‌ బబ్లీ’, ‘పహేలీ’, ‘మంగల్‌పాండే’, ‘కభీ అల్విద న కెహనా’, ‘బాబుల్‌’, ‘తర‌ర‌మ్‌పమ్‌’, ‘లగా చునారీ మెయిన్‌ దాగ్‌’, ‘తోడా ప్యార్‌ తోడా మ్యాజిక్‌’, ‘రబ్‌నే బనాది జోడి’, ‘లక్‌ బై ఛాన్స్‌’, ‘దిల్‌ బోలే హడిప్పా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘అయ్యా’, ‘తలాష్‌’, ‘బాంబే టాకీస్‌’ ఇలా ఎన్నో చిత్రాల్లో నటిం‌చింది. కొన్నింటిలో ప్రత్యే‌క‌గీ‌తాలు చేసి అల‌రిం‌చింది. ‘బ్లాక్‌’లో రాణి‌ము‌ఖర్జీ విక‌లాం‌గు‌రా‌లిగా కని‌పించి అల‌రిం‌చింది. ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ చిత్రంతో మంచి విజ‌యాన్ని సొంతం చేసు‌కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోని ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కొన్నేళ్లపాటు వెండితెరకు దూరమైన రాణీముఖర్జీ తాజాగా ‘హిచ్కీ’ చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓ అరుదైన వ్యాధితో బాధపడే యువతిగా ‘హిచ్కి’లో రాణీ కనబరచిన నటనకు సినీ ప్రియుల నుంచి ప్రశంసలు దక్కాయి. లేడి ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చక్కటి వసూళ్లను అందుకొని రాణీ సత్తాను బాలీవుడ్‌కు ఘనంగా చాటి చెప్పింది. రాణీముఖర్జీ ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ కథనాయకుడిగా నటిస్తున్న ‘జీరో’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది.


* ప్రేమ−‌పెళ్లి..
రాణి ముఖర్జీ చాలా‌ వ‌రకు వివాదాలకు దూరం అనే చెప్పాలి. అయితే ఆమె ప్రేమ, పెళ్లి విష‌యా‌లతో అప్పు‌డ‌ప్పుడు మీడియా దృష్టిని ఆక‌ర్షి‌స్తుంటుంది. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమా‌యణం సాగి‌స్తోం‌దని అప్పట్లో ప్రచారం సాగింది. వీళ్లి‌ద్దరూ పెళ్లి కూడా చేసు‌కో‌బో‌తు‌న్నా‌రని అన్నారు. ఆదిత్య చోప్రా కుటుంబ సభ్యుల జోక్యంతో ఆఖరి నిమి‌షంలో వీరి పెళ్లికి బ్రేక్‌ పడినా చివరికి వారిద్దరూ 21 ఏప్రిల్‌ 2014న ఇటలీలో పెళ్లిచేసుకోని ఒకటయ్యారు. ప్రస్తుతం రాణీకి ఒక కుమార్తె ఉంది. పేరు అదీరా.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.