శృంగార సామ్రాజ్య నాయిక.. సన్నీలియోనీ
‘పద‌కొం‌డేళ్లకి ముద్దు రుచి చూశా. పద‌హా‌రేళ్లకు కన్య‌త్వాన్ని కోల్పోయా..’. ఇలా ఎవరైనా చెబు‌తారా? సన్నీ‌లి‌యోన్‌ చెబు‌తుంది. ఏమీ దాచు‌కో‌లే‌ని‌దాన్ని, ఇక ఇలాంటి నిజాలు మాత్రం దాచుకోవడం ఎందుకు అనేది ఆమె సమాధానం. కుర్రకారు గుండెల్లో అందాల కుంపట్లు రగి‌ల్చిన శృంగార తార... సన్నీ. పాలపొంగులాంటి ఆమె సొగసులకు ప్రపంచమంతా అభిమానులున్నారు. ‘జిస్మ్‌ 2’ కోసం హిందీ తెరపైకొచ్చే‌వ‌రకు ఆమె గురించి మనలో చాలా‌మం‌దికి తెలియదు. కానీ పాశ్చాత్య దేశాల్లో సన్నీ అప్పటికే ఓ సంచ‌లనం. అడల్డ్‌ ఇండ‌స్ట్రీలో ఆమె ఓ వ్యాపార మంత్రం. ఫోర్బ్స్‌ పత్రిక సైతం ఆమె గురించి ప్రస్తా‌విం‌చింది. సన్నీ శృంగార చిత్రాల్లో నటిం‌చ‌డమే కాదు... నిర్మిం‌చింది, దర్శ‌కత్వం కూడా వహిం‌చింది. బిగ్‌బాస్‌ షోతో మన దేశంలోకి అడు‌గు‌పె‌ట్టింది. ఆ షో తర్వాత హిందీలో నటించే అవ‌కా‌శాలు అందు‌కొంది. ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో సన్నీలియోన్‌ ఓ సంచలనం, ఒక ప్రత్యే‌క‌మైన తార. ఆమె కోసం అన్ని భాషా చిత్ర సీమలు ఎదురుచూస్తున్నాయి. ‘కరెంటుతీగ’లాంటి తన వంపుసొంపులతో టాలీవుడ్‌ ఇండస్ట్రీని తన మత్తులోకి దింపేసుకుంది. తను తెరపై కనిపిస్తే చాలు ‘‘డియో డియో..’’ అంటూ కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. ప్రత్యేక గీతాలకు సన్నీ పెట్టింది పేరు. అందుకే ఆమెతో వెండితెరపై చిందేయించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్రత్యేక గీతాలు సిద్ధమవుతునే ఉంటాయి. ప్రస్తుతం ఎంతో మంది దర్శ‌కులు సన్నీనే ప్రధాన పాత్రగా చేసి సినిమాలు తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ఆమె జీవితకథను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంతకీ సన్నీ ప్రయాణం వెనక పద‌ని‌స‌లేమిటో ఓసారి తెలు‌సు‌కొందాం...

article image
కెన‌డాలో పుట్టి..
సన్నీ అసలు పేరు కర‌ణ్‌జిత్‌ కౌర్‌ వోహ్రా కెన‌డాలో (May 13, 1981) పుట్టింది. ఆమె తండ్రిది టిబెట్‌ అయినా... దిల్లీలో పెరి‌గారు. తల్లి హిమా‌చల్‌ ప్రదే‌శ్‌కి చెందినవారు. ఈ జంట కెనడాలో స్థిర‌[‌ప‌డ‌టంతో సన్నీ‌లి‌యోన్‌ అక్కడే శార్నియాలో పుట్టింది. ఆమె బాల్యం కూడా అక్కడే గడి‌చింది. సన్నీకి పద‌మూ‌డేళ్ల వయ‌సు‌న్న‌ప్పుడు వాళ్ల నానమ్మ కోరిక మేరకు... వీరి కుటుంబం అమె‌రి‌కాలోని కాలి‌ఫో‌ర్నియాకి వెళ్లి అక్కడే స్థిర‌పడింది.

మంచి అథ్లెట్‌..
సన్నీ‌లి‌యోన్‌ స్వేచ్ఛగా పెరి‌గింది. పబ్లి‌క్‌ స్కూ‌ల్‌లో రక్షణ ఉండ‌దని ఆమెని ఓ కేథ‌లిక్‌ స్కూల్‌లో చేర్పిం‌చారు తల్లి‌దం‌డ్రులు. చిన్న‌ప్పుడు ఇంటి‌ ద‌గ్గర అబ్బా‌యి‌లతో కలిసి స్ట్రీట్‌ హాకీ ఆడే‌దట. స్కూల్లో పద‌కొం‌డేళ్ల వయ‌సులో తన బాయ్‌ఫ్రెం‌డ్‌తో తొలి ముద్దు రుచి చూసిం‌దట. స్కేటింగ్‌లోనూ ఆమెకి ప్రావీణ్యం ఉంది. ఇంటి పక్కనే ఉన్న లేక్‌లో మంచు గడ్డ‌లపై స్కేటింగ్‌ చేసే‌దట. సొంతకాళ్లపై నిల‌బ‌డా‌లనే తత్వంతో పెరి‌గింది సన్నీ. నీలి చిత్రాల పరి‌శ్రమలోకి రాక‌ము‌నుపు ఆమె ఓ బేక‌రీలో పని‌చే‌సింది.

నర్స్‌ అవుదా‌మని..
డిగ్రీ పట్టా పుచ్చు‌కో‌గానే పీడియా‌ట్రిక్‌ నర్స్‌ ట్రైనింగ్‌ కోసం ఓ కళా‌శా‌లలో చేరింది. అక్కడ చదు‌వుకొం‌టు‌న్న‌ప్పుడే దుస్తులు వదిలి నాట్యం చేసే ఓ డ్యాన్స‌ర్‌తో పరి‌చయం ఏర్ప‌డింది. ఆమె కూడా సన్నీకి సహ‌చర విద్యార్థినే... ఆ యువతి వల్ల జాన్‌ స్టీవెన్‌ పరి‌చ‌య‌మ‌య్యాడు. ఆయన సన్నీకి జే అలెన్‌ అనే ఫొటోగ్రా‌ఫర్‌ని పరి‌చయం చేశాడు. పెంట్‌హౌస్‌ అనే పురుషుల పత్రి‌కకి చెందిన ఆ ఫొటో‌గ్రా‌ఫ‌ర్‌తో పరి‌చయం ఏర్ప‌డ్డాక అడల్డ్‌ ఇండస్ట్రీ గురించి సన్నీకి పూర్తి అవ‌గాహన ఏర్ప‌డింది. అమె‌రి‌కాలో ప్రఖ్యా‌తి‌గాం‌చిన పెంట్‌హౌ‌స్‌తో పాటు పలు పత్రి‌కల కోసం సన్నీ నగ్నంగా పోజు‌లి‌చ్చింది.

చెమ‌టలు పట్టాయి..
పద్దె‌ని‌మి‌దేళ్ల వయ‌సులో శృంగారం గురించి అవ‌గా‌హన ఏర్ప‌రు‌చు‌కొంది. నీలి చిత్రా‌లంటే ఏమిటి? వాటిని ఎలా తీస్తారు? అనే విష‌యాల గురించి అవ‌గా‌హన తెలు‌సు‌కొ‌న్నది అప్పుడే. తొలి‌సారి నీలి చిత్రాన్ని చూసి‌న‌ప్పుడు సన్నీకి చెమ‌టలు పట్టాయట. ఇలాంటి చిత్రాలు ఎలా తీస్తారు? అని ఆశ్చ‌ర్య‌పో‌యిం‌దట. కానీ ఆ తర్వాత మాత్రం వాటిని బాగా అర్థం చేసు‌కొంది. నీలి చిత్రాల్లో నటిస్తున్నానన్న విష‌యాన్ని ఏమాత్రం దాచ‌లేదు సన్నీ. ఇంట్లో తల్లి‌దం‌డ్రు‌లకు చెప్పి వారి ఆమోదం కోరిం‌దట. తల్లి‌దం‌డ్రులు తొలుత తిర‌స్క‌రిం‌చినా ఆ తర్వాత ఆమె నిర్ణ‌యా‌నికే వది‌లే‌శా‌రట. తల్లి మాత్రం తీవ్ర ఆవే‌దన వ్యక్తం చేసేదట. ‘‘నేను అడల్ట్‌ ఇండ‌స్ట్రీలోకి ప్రవే‌శించడం నా తల్లి‌దం‌డ్రు‌లకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఎంతైనా తల్లి‌దం‌డ్రులు కదా.. నాతో మాట్లా‌డటం మాత్రం మాన‌లేదు. చివరి వరకు ప్రేమ చూపారు. నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం. అమ్మా‌నా‌న్నలు శాశ్వ‌తంగా దూరం కావడం బాధగా ఉంది’’ అని చెబు‌తుం‌టుంది. నీలి చిత్రాల్లో నటిం‌చడం మొద‌లు‌పె‌ట్టాకే ఆమె తన పేరును మార్చు‌కొంది.

article image

తొలి అవ‌కాశం..
నీలి చిత్రాల్లో నటిం‌చడం పాటు ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ కథా‌నా‌యి‌కగా అవ‌కా‌శాలు అందుకొంది సన్నీలియోన్‌. అక్కడ మూడు చిత్రాల్లో నటిం‌చింది. కొన్ని టెలి‌వి‌జన్‌ ధారాహి‌కల్లోనూ నటిం‌చింది. బిగ్‌బాస్‌ రియా‌లిటీ షో కోసం ఆమె ఇండి‌యా‌ కొ‌చ్చింది. అక్కడ కూడా ఆమె ‘నేను నీలి చిత్రాల కథానా‌యిక’ అని చెప్పు‌కో‌వ‌డా‌నికి ఏమాత్రం సంశ‌యిం‌చ‌లేదు. దీంతో ఆ షో జరు‌గు‌తు‌న్నప్పుడు కొన్ని వివాదాలు కూడా చెల‌రే‌గాయి. బాలీ‌వుడ్‌ దృష్టిలో కూడా అప్పుడే పడింది సన్నీ. మహేష్‌ భట్‌ ’జిస్మ్‌2’తో తొలి అవ‌కా‌శాన్ని అందు‌కొంది. ఆ తర్వాత ‘రాగిణి ఎమ్‌ఎ‌మ్‌ఎస్‌’, ‘షూట్‌ ఔట్‌ ఎట్‌ వాదాలా’, ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌2’, ‘హేట్‌స్టోరీ2’, ‘రయిస్‌’, ‘కరెంటు తీగ’, ‘నూర్‌’, ‘బాద్షాహో’, ‘భూమి’, ‘పిఎస్‌వి గరుడ వేగ’ వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి మెప్పించింది. ప్రస్తుతం ‘జాక్‌పా‌ట్‌’తో పాటు తమి‌ళంలో ‘వడా కర్రీ’ చిత్రంలోనూ నటిం‌చింది.

ఎప్పుడో రావా‌ల్సింది..
నిజా‌నికి సన్నీలియోన్‌ హిందీ చిత్ర పరి‌శ్రమ‌లోకి ఎప్పుడో రావా‌ల్సింది. మోహిత్‌ సూరితాను తెర‌కెక్కించిన ‘కల్‌యుగ్‌’ సినిమా కోసం సన్నీ‌లి‌యో‌న్‌ని కథా‌నా‌యి‌కగా ఎంచు‌కో‌వా‌ల‌ను‌కొ‌న్నాడు. కానీ ఆమె పారి‌తో‌షికం భారీగా డిమాండ్‌ చేయ‌డంతో కుద‌ర‌లేదు. అప్పట్నుంచే సన్నీ‌లి‌యోన్‌ పూర్తి‌స్థాయిలో కమ‌ర్షి‌యల్‌ చిత్రా‌లపై దృష్టి‌పె‌ట్టా‌లని నిర్ణ‌యిం‌చు‌కొం‌దట.

article image
పెళ్లి చేసు‌కొంది..
తన మన‌సును పూర్తిగా అర్థం చేసు‌కొన్న డేనియల్‌ వెబె‌ర్‌తో జీవి‌తాన్ని పంచు‌కొంది సన్నీ. తొలుత మట్‌ ఎరి‌క్‌స‌న్‌తో నిశ్చి‌తార్థం జరిగింది. అయితే వారి‌ద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి 2008లో విడి‌పో‌యారు. రస్సెల్‌ పీటర్‌ అనే ఓ కమె‌డి‌య‌న్‌తో కొన్నా‌ళ్ల‌ పాటు సన్ని‌హి‌తంగా మెలి‌గింది సన్నీ. ఆ తర్వాత డేనియల్‌ వెబెర్‌ ఆమెని ప్రేమించాడు. చివ‌రికి అత‌ని‌తోనే జీవి‌తాన్ని పంచు‌కో‌వా‌లని నిర్ణ‌యించు‌కొంది. వారిద్దరి జీవితం ఇప్పుడు అన్యో‌న్యంగా సాగు‌తోంది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలున్నారు. తొలుత 2017లో మహారాష్ట్రకు చెందిన రెండేళ్ల పాపను దత్తత తీసుకున్నారు సన్నీ దంపతులు. ఆ పాపకు నిషా వెబర్‌ కౌర్‌ అని పేరుపెట్టుకొన్నారు. అయితే తాజాగా వారిద్దరూ సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. వీరికి ఆషర్‌ సింగ్‌ వెబర్‌.. నోవా సింగ్‌ వెబర్‌ అని పేర్లు పెట్టుకొన్నారు. ప్రస్తుతం సన్నీలియోన్‌ ఈ ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఎంతో మురిసిపోతోంది.

మనసులో మాట..
* నా జీవి‌తంలో అత్యంత సంతో‌ష‌క‌ర‌మైన సందర్భం డేని‌య‌ల్‌ని పెళ్లి చేసు‌కొన్న క్షణాలు.

* అత్యంత బాధాక‌ర‌మైన సంఘ‌టన అంటే మా తల్లిదం‌డ్రులు చని‌పో‌వడం.

* నటి కాక‌పో‌యుంటే పీడి‌యా‌ట్రిక్‌ నర్స్‌ని అయ్యే‌దాన్ని.

* హిందీలో చేసిన నా తొలి చిత్రం ‘జిస్మ్‌2’ కావడం చాలా ఆనందాన్ని‌చ్చింది.

* బాలీ‌వుడ్‌ ఓ కొత్త ప్రపంచం. తొలినాళ్లలో ఇక్కడ పరి‌స్థి‌తు‌లను అర్థం చేసు‌కో‌వ‌డా‌నికి చాలా కష్టపడ్డా. నాకు ఈ పరి‌శ్రమ ఓ కొత్త వ్యాపా‌రంలా ఉంది.

* ఆమీ‌ర్‌ఖాన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటిం‌చిన సిని‌మాల్ని అమ్మతో కలిసి చూసే‌దాన్ని.

* ప్రత్యేక గీతాల్లో ‘చిక్నీ చమేలీ...’ గీతం అంటే చాలా ఇష్టం.

* హిందీ అంటే నాకు చాలా ఇష్టం. నేర్చు‌కో‌వ‌డా‌నికి తీవ్రంగా ప్రయ‌త్ని‌స్తున్నా. ప్రస్తుతం చాలా‌మం‌దితో హిందీ‌లోనే మాట్లా‌డు‌తున్నా. అయితే కొన్ని తప్పులు మాత్రం దొర్లు‌తు‌న్నాయి.

* నాకు బాగా ఇష్ట‌మైన ఆహారం అంటే ఆలూ కా పరాటా.

article image


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.