అరిజోనా అమ్మాయి... ఆర్జనలో హవాయి!
నాలుగేళ్లకే నాటక రంగంలోకి అడుగుపెట్టింది... పదిహేనేళ్లకల్లా వెండితెరపై ఆశపడింది... అమ్మానాన్నల్ని ఒప్పించి ప్రయత్నాలు మొదలెట్టింది... టీవీల్లో మెరిసి, వెండితెరపైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగింది...


ఎంతలాగో తెలుసా?


- ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకునేంతగా!

- ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుర జాబితాలోకి ఎక్కేంతగా!!

ఆమే ఎమిటీ జీన్‌ స్టోన్‌. ఎమ్మాస్టోన్‌గా చిరపరిచితురాలైన ఈ చలాకీ తార ఆస్కార్, బాఫ్తా, గోల్డెన్‌గోల్డ్‌ లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకుంది. అరిజోనాలో 1988 నవంబర్‌ 6న పుట్టిన ఎమ్మాస్టోన్‌ సినిమా ఆశలతో హాలీవుడ్‌కి వచ్చి ‘సూపర్‌బ్యాడ్‌’ (2007) సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆపై ‘జాంబీలాండ్‌’, ‘ఈజీ ఏ’, ‘క్రేజీ స్టుపిడ్, లవ్‌’, ‘ద హెల్ప్‌’, ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’, ‘లా లా ల్యాండ్‌’, ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సెక్సెస్‌’, ‘ద ఫేవరిట్‌’ లాంటి సినిమాలతో మెప్పించింది. ఈ సంవత్సరం రూబెన్‌ ఫ్లీషర్‌ దర్శకత్వంలో వచ్చిన జోంబియాల్యాండ్‌: డబుల్‌ ట్యాప్‌’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. మరో పక్క ‘క్రూయెల్లా’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా మే 28, 2021న తెరపైకి రానుంది. ఎమ్మా వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన ప్రతిభను నిరూపించుకొంటోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.