‘టైటానిక్‌’ ప్రేమికుడు పర్యావరణ సైనికుడు!
article image
టైటా‌నిక్‌ ఓడను ముంచే‌సింది ఓ మంచు‌గడ్డ.‌.‌.‌
అది తెలి‌యక జరి‌గిన ప్రమాదం.‌
భవి‌ష్య‌త్తులో ఈ భూమం‌డ‌లాన్నే ముంచే‌య‌బో‌తోంది గ్లోబల్‌ వార్మింగ్‌.‌.‌.‌
ఇది తెలిసీ మన కళ్లె‌దుటే జరు‌గు‌తున్న ఉప‌ద్రవం.‌
దీనికి కార‌కుడు మనిషే.‌.‌ దీన్ని అరి‌క‌ట్టా‌ల్సిందీ మనిషే.‌
ఈ విష‌యాన్ని గుర్తె‌రిగి నేల‌త‌ల్లిని కాపా‌డు‌కో‌వ‌టా‌నికి ఓ మనిషి కది‌లాడు.‌
అతడే లియో‌నార్డో డికా‌ప్రియో.‌ ‌‘టైటా‌నిక్‌’‌ కథా‌నా‌య‌కుడు.‌.‌ ఇప్పుడు పర్యా‌వ‌రణ సైని‌కుడు.‌

లియోనార్డో డికాప్రియో 1974 నవంబరు 11న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జార్జి డికాప్రియో, ఇర్మెలిన్‌ ఇండెన్బెర్కెన్‌ దంపతులకు జన్మించాడు. నట‌నంటే ఏంటో తెలి‌యని వయ‌సు‌లోనే నటిం‌చడం మొద‌లె‌ట్టాడు డికా‌ప్రియో.‌ ఐదేళ్ల వయ‌సు‌లోనే అతడు ఓ బాలల టీవీ సిరీ‌స్‌లో కని‌పిం‌చాడు.‌ తన ప్రమేయం లేకుం‌డానే నటు‌డిగా మారిన డికా‌ప్రి‌యోకు ‌‘టైటా‌నిక్‌’‌ వరకు నటన తప్ప మరోటి తెలి‌యదు.‌ తొలుత వాణిజ్య ప్రక‌ట‌నల్లో నటిం‌చ‌డంతో మొద‌లైన అతని ప్రయాణం, టీవీ సీరి‌యళ్ల మీదుగా వెండి‌తె‌రకు చేరింది.‌ సహాయ నటు‌డిగా తొలి ఆస్కార్‌ నామి‌నే‌షన్‌ అందు‌కున్న డికా‌ప్రియో.‌.‌.‌ ఒక్కో చిత్రంతో ఎదు‌గుతూ ‌‘టైటా‌నిక్‌’‌ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపా‌దిం‌చు‌కు‌న్నాడు.‌ 1997లో వచ్చిన ఆ చిత్రం నటు‌డిగా అతన్ని అగ్రస్థా‌యికి చేర్చింది.‌ దాని తర్వాత అతను నటిం‌చ‌బోయే సినిమా ఏంటో అని అందరూ ఎదు‌రు‌చూ‌స్తున్న సమ‌యంలో డికా‌ప్రియో ‌‘ఎల్‌డీ‌ఎఫ్‌’‌ ప్రక‌టిం‌చాడు.‌ అయితే అది సినిమా పేరు కాదు.‌.‌ ‌‘లియో‌నార్డో డికా‌ప్రియో ఫౌండే‌షన్‌’‌.‌ గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల జీవ‌జా‌తులు నశిం‌చి‌పో‌తుం‌డటం డికా‌ప్రి‌యోను కల‌వ‌ర‌పె‌ట్టింది.‌ దాన్ని అరి‌క‌ట్టేం‌దుకు మను‌షుల్లో ఒక‌డిగా నా బాధ్య‌తేంటి? అన్న డికా‌ప్రియో ఆలో‌చన ఎల్‌డీ‌ఎఫ్‌కు ప్రాణం పోసింది.‌ ‌‘టైటా‌నిక్‌’‌లో సము‌ద్రంలో ముని‌గి‌పో‌తున్న ఓడ‌లోంచి ప్రియు‌రా‌లిని కాపా‌డ‌టా‌నికి తన ప్రాణా‌లనే త్యాగం చేసిన ప్రేమి‌కు‌డిగా మెప్పిం‌చాడు డికా‌ప్రియో.‌ ఇప్పుడు గ్లోబల్‌ వార్మింగ్‌ కడ‌లిలో కొట్టు‌మి‌ట్టా‌డుతూ కొన ఊపి‌రితో ఉన్న జీవ జాతు‌లను కాపా‌డ‌టా‌నికి ఓ పర్యా‌వ‌రణ ప్రేమి‌కు‌డిగా నిరం‌తర పోరాటం చేస్తు‌న్నాడు.‌

ఓవైపు ఎల్‌డీ‌ఎఫ్‌ను నిర్వ‌హి‌స్తూనే నటు‌డిగా, నిర్మా‌త‌గానూ ప్రేక్ష‌కు‌లను ఆక‌ట్టు‌కుం‌టు‌న్నాడు డికా‌ప్రియో.‌ ‌‘ది డిపా‌ర్టెడ్‌’, ‌‘బ్లడ్‌ డైమండ్‌’, ‌‘ఇన్సె‌ప్షన్‌’‌ తది‌తర చిత్రా‌లతో ఘన‌వి‌జ‌యాలు అందు‌కు‌న్నాడు.‌ ‌‘ది ఏవి‌యే‌టర్‌’, ‌‘బ్లడ్‌ డైమండ్‌’‌ ‘ది రెవెనెంట్‌’ చిత్రాలతో నటుడిగా, ‌‘ది వుల్ఫ్‌ ఆఫ్‌ వాల్‌స్ట్రీట్‌’‌కు నిర్మా‌తగా ఆస్కార్‌ నామి‌నే‌షన్‌ అందు‌కు‌న్నాడు.‌ వీటిలో ‘ది రెవెనెంట్‌’ (2016) చిత్రంతో ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును దక్కించుకున్నాడు. డికాప్రియో ‌గ్లోబల్‌ వార్మింగ్‌ దుష్ప‌రి‌ణా‌మా‌లపై అవ‌గా‌హన కల్పిం‌చేం‌దుకు 2007లో ‌‘11 అవర్‌’‌ చిత్రాన్ని నిర్మిం‌చి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ‘రాబిన్‌ హుడ్‌’ అనే యాక్షన్‌ అడ్వంచర్‌ సినిమాను నిర్మిస్తున్నాడు.‌ ‌‘టైటా‌నిక్‌’‌ నుంచి డికా‌ప్రి‌యోకు అమ్మా‌యిల్లో క్రేజ్‌ పెరి‌గి‌పో‌యింది.‌ బ్రిటిష్‌ మోడల్‌ క్రిస్టీనా జంగ్, బ్రెజిల్‌ మోడల్‌ గీసె‌ల్‌తో‌పాటు మరి‌కొం‌దరు సుంద‌రాం‌గు‌లతో డికా‌ప్రియో డేటింగ్‌ చేశాడు.‌
ఎల్‌డీ‌ఎఫ్‌ సేవలు:‌ ఎల్‌డీ‌ఎఫ్‌ ఛైర్మ‌న్‌గా డికా‌ప్రియో ప్రధా‌నంగా నాలుగు అంశాల్లో కృషి చేస్తు‌న్నాడు.‌ వాతా‌వ‌రణ మార్పుల అధ్య‌యనం, సము‌ద్రాల పరి‌రక్షణ, అట‌వీ ‌ప్రాం‌తాల అభి‌వృద్ధి.‌ జీవ‌ వై‌వి‌ధ్యాన్ని కాపా‌డ‌టమే లక్ష్యంగా ఎల్‌డీ‌ఎఫ్‌ పని‌చే‌స్తోంది.‌ ఈ క్రమంలో 40 దేశా‌ల్లోని దాదాపు 70 స్వచ్ఛంద సంస్థ‌లను ఒక్క‌తా‌టి‌పైకి తెచ్చి సేవా సైన్యాన్ని తయా‌రు ‌చే‌శాడు డికా‌ప్రియో.
వేలం ద్వారా నిధులు:‌ అవ‌స‌ర‌మైన నిధుల్ని విలు‌వైన వస్తు‌వుల వేలంతో పాటు విరా‌ళాల ద్వారా సమ‌కూ‌ర్చు‌కుం‌టోంది ఎల్‌డీ‌ఎఫ్‌.‌ డికా‌ప్రి‌యోకు చెందిన ఖరీ‌దైన చేతి గడి‌యారం, అతడు దాచు‌కున్న ప్రముఖ చిత్రకా‌రుల చిత్రా‌ల‌తో‌పాటు ఇతర వస్తు‌వు‌లను వేలం వేస్తే, 2014లో రూ.‌ 160 కోట్లు (25 మిలి‌యన్‌ డాలర్లు) వచ్చాయి.‌ తాజాగా ఈ నెల 23న జరి‌గిన వేలంలో రూ.‌ 256 కోట్లు (40 మిలి‌యన్‌ డాలర్లు) సమ‌కూ‌రాయి.
మార్పు తన నుంచే:‌ మార్పు ఏదైనా మన నుంచే మొద‌ల‌వ్వా‌లన్న మాటను డికా‌ప్రియో ఆచ‌రి‌స్తు‌న్నాడు.‌ ఇంధ‌నంతో నడిచే వాహ‌నాల పొగ వల్ల వాతా‌వ‌రణం కలు‌షి‌త‌మ‌వు‌తుం‌దని ఎలక్ట్రిక్‌ కార్లను వాడు‌తు‌న్నాడు.‌ అధిక విద్యుత్తు విని‌యోగం వల్ల వన‌రులు వ్యర్థ‌మ‌వు‌తా‌యని సౌర‌శ‌క్తిని విని‌యో‌గి‌స్తు‌న్నాడు.
ఐరాస దూత:‌ డికా‌ప్రియో కృషిని గుర్తిం‌చిన ఐక్య‌రాజ్య సమితి అత‌డిని పర్యా‌వ‌రణ పరి‌రక్షణ దూతగా నియ‌మిం‌చింది.‌ ఆ హోదాలో డికా‌ప్రియో వివిధ వేది‌క‌లపై పర్యా‌వ‌ర‌ణంపై అవ‌గా‌హన కలి‌గిస్తూ ప్రచారం చేస్తు‌న్నాడు.‌ న్యూయార్క్‌ వీధుల్లో 4 లక్షల మంది ప్రజ‌లతో భారీ ర్యాలీ నిర్వ‌హిం‌చాడు.
ఆర్థిక చేయూత:‌ ప్రకృతి వైప‌రీ‌త్యాల వల్ల నష్ట‌పో‌యిన దేశా‌లకు తన వంతుగా సహాయం అంది‌స్తు‌న్నాడు.‌ 2010లో భారీ భూకం‌పంతో దెబ్బ‌తిన్న హైతీకి 10 లక్షల డాలర్లు విరా‌ళ‌మం‌దిం‌చాడు.‌ 1998లో భూకం‌పంతో కూలి‌పో‌యిన లాస్‌ ఏంజిల్స్‌ పబ్లిక్‌ లైబ్రరీ శాఖ పున‌ర్ని‌ర్మా‌ణా‌నికి 35 వేల డాలర్లు సహా‌య‌మం‌దిం‌చాడు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.