
ఓ టీవీ సీరియల్ కోసం ఓ నటుడు ఎపిసోడ్‌కి మిలియన్ డాలర్ల పారితోషికం పొందాడంటే... ఆ సీరియల్, ఆ నటుడు ఎంతగా ఆకట్టుకున్నారో వేరే చెప్పక్కర్లేదు. అమెరికాలోనే కాకుండే అనేక దేశాల్లో పదేళ్ల పాటు ఇంటింటి టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన ఆ సీరియల్ ‘ఫ్రెండ్స్’ అయితే, అందులో చాండ్లర్ బింగ్ పాత్ర ద్వారా ఆకట్టుకున్న నటుడు మ్యాథ్యూ పెర్రీ. నటుడిగా, కమేడియన్‌గా, నాటక రచయితగా ప్రాచుర్యం పొందిన పెర్రీ వెండితెరై కూడా గుర్తుండిపోయే పాత్రల ద్వారా అభిమానులను అలరించాడు. ‘ఫూల్స్ రష్ ఇన్’, ‘ద హోల్ నైన్ యార్డ్స్’, ‘17 ఎగైన్’లాంటి సినిమాల ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అమెరికాలో 1969 ఆగస్టు 19న పుట్టిన ఇతడు పదిహేనేళ్ల నుంచి నటనా రంగంవైపు ఆకర్షితుడయ్యాడు. టీవీ సీరియల్స్ ద్వారా ప్రాచుర్యం సంపాదించి వెండితెరపై వెలిగాడు.