హాలీవుడ్‌ సెక్స్‌ సింబల్!

అందాల శృంగార తారగా గుర్తింపు... వంద మంది మేటి సెలబ్రిటీల జాబితాలో ఎన్నో సార్లు ఫోర్బ్స్ పత్రిక ఎంపిక... హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్టార్‌ హోదా... ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటి... అంతేకాదు, మనసున్న యువతి... ఎన్నో ఛారిటీ సంస్థలకు భారీ విరాళాల ఇచ్చిన నేపథ్యం...ఇన్ని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్న నటి స్కార్లెట్‌ జొహాన్సన్‌. నటిగా, గాయనిగా ముద్ర వేసిన ఈ అందాల తార చిన్నప్పటి నుంచీ చురుకే. పాటలతో, డ్యాన్స్‌లతో పాటు నాటక రంగంపైకి చిన్న వయసులోనే అరంగేట్రం చేసింది. న్యూయార్క్‌లో 1984లో పుట్టిన స్కార్లెట్‌ పదేళ్ల వయసులోనే ‘నార్త్‌’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ‘మన్నీ అండ్‌ లో’, ‘ద హార్స్‌ విస్పరర్‌’, ‘ఘోస్ట్‌ వరల్డ్‌’, ‘లాస్ట్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌’, ‘గర్ల్‌ విత్‌ పెర్ల్‌ ఇయర్‌రింగ్‌’, ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘ద ప్రెస్టీజ్‌’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా అందచందాలతోను, అభినయంతోను మెప్పించింది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.