చురుకైన కుర్రాడు


నటుడిగా, కమేడియన్‌గా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా చురుగ్గా ముందుకు సాగుతున్నాడు సేత్‌ రోజెన్‌. టీనేజిలో హాస్య ప్రదర్శనలతో కెరీర్‌ ప్రారంభించిన ఇతడు ఆపై టీవీ, సినీ రంగాల్లో మంచి గుర్తింపు సాధించాడు. టీవీ కార్యక్రమాలకు మంచి స్క్రిప్టులు అందించి ప్రైమ్‌ టైమ్‌ ఎమ్మీ అవార్డు పొందాడు. వెండినెరపై ‘డోనీ డార్కో’తో మొదలు పెట్టి, ‘ద 40 ఇయర్‌ ఓల్డ్‌ వర్జిన్‌’, ‘నాక్డ్‌ అప్‌’, ‘ఫన్నీ పీపుల్‌’, ‘సూపర్‌ బ్యాడ్‌’, ‘పైనాపిల్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ద గ్రీన్‌ హార్నెట్‌’, ‘దిస్‌ ఈజ్‌ ద ఎండ్‌’, ‘ద ఇంటర్వూ్య’, ‘ద డిసాస్టర్‌ ఆర్టిస్ట్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. కెనడాలో 1982 ఏప్రిల్‌ 15న పుట్టిన ఇతడు బహుముఖ ప్రజ్ఞతో ముందుకు దూసుకుపోతున్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.