అందమైన ప్రతిభ

-ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఎదిగింది!
-ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలిగా నిలిచింది!
-రెండు ఆస్కార్లు, మూడు గోల్డెన్‌గ్లోబ్‌లు, మూడు బాఫ్టా అవార్డులు గెలుచుకుంది!
-ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి సెంటినరీ మెడల్‌ అందుకుంది!
-ఫ్రెంచి ప్రభుత్వం నుంచి చెవాలియర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పురస్కారం పొందింది!

న్ని ఘనతలు సాధించిన ఆమె కేట్‌ బ్లాంచెట్‌. అన్నింటితో పాటు అందాల నటిగా ప్రేక్షకులను కూడా అలరించింది. అంతర్జాతీయంగా విజయవంతమైన ‘ద టాలెంటెడ్‌ మిస్టర్‌ రిప్లే’, ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’ ట్రయాలజీ, ‘ద హాబిట్‌’ ట్రయాలజీ, ‘బాబెల్‌’, ‘ద క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ బెంజమిన్‌ బట్టన్‌’, ‘సిండ్రెల్లా’, ‘థోర్‌: రగ్నరోక్‌’, ‘ఓషన్స్‌8’ ‘ఎలిజబెత్‌’, ‘ద ఏవియేటర్‌’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలో 1969 మే 14న పుట్టిన కేట్, చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆకర్షితురాలైంది.

                                     


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.