ఓ మంచి హాస్యనటుడు..

తడి సినిమాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 9 బిలియన్‌ డాలర్లును వసూలు చేశాయి. అతడి నటనకు ఎన్నో అవార్డులు వచ్చిపడ్డాయి. ఉత్తమ నటుడిగా రెండు వరుస సంవత్సరాల్లో రెండు ఆస్కార్‌ అవార్డులు పొందిన రికార్డు కేవలం ఇద్దరికే ఉంటే అందులో ఒకడుగా అతడు గుర్తింపు పొందాడు. అతడే టామ్‌హ్యాంక్స్‌. నాలుగేళ్లకే అమ్మానాన్నా విడిపోతే నాన్నతో వెళ్లిపోయి సవతి తల్లి దగ్గర పెరిగిన గందరగోళ బాల్యం నుంచి ఎదిగిన అతడు ఓ మంచి హాస్య నటుడిగా, ఓ చక్కని క్యారెక్టర్‌ నటుడిగా వెండితెరపై వెలిగాడు. 1980లో వచ్చిన ‘హి నోస్‌ యువార్‌ ఎలోన్‌’ అనే లోబడ్జెట్‌ సినిమాతో మొదలైన టామ్‌హ్యాంక్స్, ‘స్ప్లాష్‌’, ‘బిగ్‌’, ‘టర్నర్‌ అండ్‌ హూచ్‌’, ‘ఏ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ ఓన్‌’, ‘స్లీప్‌లెస్‌ ఇన్‌ సియాటిల్‌’, ‘క్యాస్ట్‌ఎవే’, లాంటి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌తో చేసిన ‘సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్‌’, ‘క్యాచ్‌మీ ఇఫ్‌ యుకెన్‌’, ‘ద టెర్మినల్‌’, ‘బ్రిడ్జి ఆఫ్‌ స్పైస్‌’, ‘ద పోస్ట్‌’ సినిమాలు అతడి నటనకు ప్రశంసలు తెచ్చాయి. నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఎదిగిన అతడు బాఫ్తా అవార్డును, కెన్నెడీ సెంటర్‌ గౌరవాన్ని, ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ను, ఫ్రెంచ్‌ లెజియన్‌ గౌరవాన్ని అందుకున్న ప్రతిభావంతుడు. 1956లో ఇతడు జులై 9న పుట్టాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.