‘83’ ఫస్ట్‌లుక్‌ చూశారా

ఇటీవలే ‘సింబా’, ‘గల్లీబాయ్‌’ చిత్రాలతో వరుస హిట్లు అందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రణ్‌వీర్‌ సింగ్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే ‘83’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న నేపథ్యంతో దీన్ని రూపొందించబోతున్నారు. కపిల్‌గా రణ్‌వీర్‌ సందడి చేయబోతున్నాడు. కబీర్‌ సింగ్‌ దీనికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు రణ్‌వీర్‌. ‘‘ఈరోజు నుంచి సరిగ్గా సంవత్సరం.. ఇండియా గ్రేటెస్ట్‌ స్టోరీని ఏప్రిల్‌ 10, 2020న విడుదల చేయబోతున్నాం’’ అంటూ దానికి ఓ వ్యాఖ్యను కూడా జత చేశారు. ఈ ప్రచార చిత్రంలో 83 ప్రపంచ కప్‌ టీం సభ్యులంతా మైదానంలో నుంచోని ఫోజిస్తున్నట్లుగా కనిపించారు. ఇందులో సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణిగా సాహిల్‌ ఖట్టర్, బల్వీందర్‌ సింగ్‌గా అమ్మీ విర్క్‌ కనిపించబోతున్నారు. ఇక రణ్‌వీర్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తోన్నట్లు తెలుస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.