ఫలితాల తర్వాతే విడుదల

ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎమ్‌ నరేంద్రమోదీ’. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఎన్నికల పూర్తయ్యేవరకూ బయోపిక్‌లు విడుదల, ప్రచారం నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఈ సినిమా విడుదల వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని ఈ నెల 24న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘మాకు చట్టం అంటే గౌరవం ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. 19తో ఎన్నికల పూర్తవుతాయి కాబట్టి మాకు ప్రచారానికి నాలుగు రోజులు సమయం ఉంటుంది. బహుశా ఈ విడుదల తేదీతో ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్నామ’’ని చెప్పారు. ఒమంగ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోదీగా వివేక్‌ ఒబేరాయ్‌ నటించారు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.