పూజా పాదంపై అక్కీ ముద్దు!!

పూజా హెగ్డే.. ఇప్పుడీ పేరు ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాదిలో మోస్ట్‌వాంటెడ్‌ హీరోయిన్ల జాబితాలో ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’, ‘జాన్‌’ వంటి భారీ చిత్రాలు చేస్తూనే బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ వంటి క్రేజీ ప్రాజెక్టుతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ఈ భామ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కు జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రితేష్‌ దేశ్‌ముఖ్, బాబీ దేవోల్, కృతిసనన్, కృతి కర్బందా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈనెల 26న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా తాజాగా ‘‘ఏక్‌ చుమ్మా..’’ అంటూ సాగే ఓ గీతాన్ని విడుదల చేశారు. అయితే ఇప్పుడీ పాటలోని ఓ సన్నివేశం సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతంలోని ఓ సన్నివేశంలో అక్షయ్‌.. పూజా హెగ్డే పాదంపై ముద్దుపెడుతూ కనిపించారు. దీంతో ఈ సీన్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అక్షయ్‌ వంటి స్టార్‌ నేలపై పడుకోని పూజా పాదంపై ముద్దు పెడుతుండటం చూడటానికి ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తోంది. ఈ పాట ఆద్యంతం ఇలాంటి చిలిపి ముద్దులు బాగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘సైతాన్‌ కా సాలా’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కగా.. ఇప్పుడీ పాట కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కుతుండటం విశేషం.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.