తాప్సీ హత్య చేసిందా?

మితాబ్‌ బచ్చన్, తాప్సి గతంలో కలసి నటించిన ‘పింక్‌’ మంచి విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో చిత్రం రాబోతోంది. అదే ‘బద్లా’. ‘కహానీ’తో మెప్పించిన సుజయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. 2017లో విడుదలైన స్పానిష్‌ చిత్రం ‘ది ఇన్‌విజిబుల్‌ గెస్ట్‌’కు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. మర్డర్‌ మిస్టరీ చుట్టూ సాగే ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమితాబ్‌ లాయర్‌గా నటిస్తున్నారు. హత్యోదంతంలో బాయ్‌ఫ్రెండ్‌ను కోల్పోయి అనుకోని పరిస్థితుల్లో తనే నిందితురాలిగా చిక్కుకున్న యువతిగా తాప్సి నటించింది. మరి ఆ హత్య తాప్సినే చేసిందా లేదా అన్నది ఆసక్తికరమని చిత్రబృందం చెబుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఉత్కంఠ రేపుతోంది. ‘ప్రతిసారీ ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం సరికాదు. అలాగే ప్రతిసారీ క్షమించేయడం కూడా సరికాదు’ లాంటి సంభాషణలు ఇందులో వినిపించాయి. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.