వచ్చేనెల్లో తెరపైకి రానున్న శుభ్‌ మంగల్‌

ఈ ఏడాది ఆరంభంలోనే బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖుర్రానా కొత్త చిత్రం ‘శుభ్‌ మంగల్‌ జ్యదా సావ్థన్‌’తో తెరపైకి రానున్నాడు. గత ఏడాది మూడు చిత్రాల్లో సందడి చేసిన ఆయుష్‌ ఈ సారి ఏడాది మొదట్లోనే ప్రేక్షకులను అలరించనున్నాడు. హితేష్‌ కేవల్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్‌ సృలింగ సంపర్కుడిగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి విషయంలో మాట్లాడానికే ఇబ్బంది పడే సమయంలో, ఏకంగా ఆ పాత్రలోనే నటించడం అంటే చాలా ధైర్యం కావాలని సినీ జనాలు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో జితేంద్ర అనే మరో నటుడు ఆయష్‌కి జోడిగా నటిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ, హోమో సెక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ-సీరీస్‌, ఎల్లో ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూమి ఫెడ్నేకర్‌, గజరాజా రావ్‌, నీనా గుప్తలు నటిస్తున్న చిత్రం ఫిబ్రవరి 21, 2020న విడుదల కానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.