త్వరలోనే ‘హమీద్‌’ విడుదల

కాశ్మీర లోయలోని ఓ కుర్రాడికి, అక్కడే ఉన్న పారామిలటరీ జవానుకు మధ్య ఏర్పడిన అనుబంధాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘హమిద్‌’. అజీజ్‌ఖాన్‌ దర్శకత్వంలో రిషిక దుగ్గల్, వికాస్‌ కుమార్, తలత్‌ అర్షద్‌ రేషిలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 1న విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల చేత వాయిదా పడింది. మార్చి 15వ తేదీన విడుదల చేస్తామని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 10, 2018న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైతే 2.4 మిలియన్ల మంది వీక్షించారు. సారేగామా సమర్పణలో వస్తున ఈ చితాన్ని యాద్లీ ఫిల్మ్స్‌ నిర్మిస్తుంది. అరవిందర్‌ రంఢ్వా, సుమిత్‌ సక్సేనా కథ అందించారు. సంగీతం: ఆండ్రివ్యూ మార్కే, విక్రమ్‌ మెహ్ర, సిద్దార్ద్‌ ఆనంద్‌ కుమార్‌ నిర్మాతలు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.