త్వరలోనే విడుదల కానున్న ‘డేంజరస్’‌

విక్రమ్ భట్ అందించిన కథతో సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘డేంజరస్’‌. భూషణ్‌ పటేల్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటి బిపాస బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి మికా సింగ్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఐదు సంవత్సరాల తరువాత ‘డేంజరస్’ చిత్రం కోసం బిపాషా - కరణ్ జంటగా నటిస్తున్నారు. వెబ్‌సీరీస్‌గా వస్తున్న ఈసినిమా కథేంటంటే.. బాగా డబ్బు కలిగిన ఒక ధనవంతుడు ఆదిత్య ధన్‌రాజ్‌ (కరణ్‌ సింగ్‌) ఆయన భార్య దియా ధన్‌రాజ్‌ (సోనాలి రాత్‌)  తప్పిపోతుంది. ఆమెను వెతకడానికి తన మాజీ ప్రేయసి నేహా సింగ్‌ (బిపాస బసు) పోలీసుల సహాయంతో తన భార్యను వెతుకుతూ బయలుదేరుతారు. అయితే ఆమె ఎందుకు తప్పిపోయిందా లేక ఎవరైనా వ్యాపార శత్రుత్వంతో ఆమెను అపహరించారా ఇంకేమైనా చేశారానేది చిత్రంలోని మిగిలిన కథ. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఆగస్టు 6న మ్యాక్స్  ప్లేయర్‌ యూట్యూబ్‌లో విడుదలైంది. ట్రైలర్లో ఆదిత్య (కరణ్‌) ప్రధాన నిందితుడిగా డేంజరస్ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. దియా అపహరణను పరిష్కరించే అధికారిగా బిపాస బసు కనిపిస్తుంది. ఇంకా ట్రైలర్లో కరణ్‌ సింగ్ గ్రోవర్ల - బిపాసల మధ్య శృంగార దృశ్యాలు ఉన్నాయి. అసలు వారు ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో తిరిగి కలుసుకున్నారనేది కూడా తెలుస్తుంది. సోనాలి రౌత్, నితిన్ అరోరా, నటాషా సూరి, సుయ్యాష్ రాయ్ ఇతర సహాయక పాత్రల్లో నటించారు. ఆగస్టు 14, 2020న చిత్రం ఓటీటీ వేదికగా మ్యాక్స్ ప్లేయర్‌లో విడుదల అవుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.