‘ఛపాక్‌’ ప్రయోగం.. దీపికను గుర్తించని జనం

‘ఛపాక్‌’ చిత్ర బృందం ఓ వినూత్న ప్రయోగం చేసింది. బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రమిది. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితాధారంగా తెరకెక్కింది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో యాసిడ్‌ దాడి బాధితుల పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది చిత్ర బృందం. ఇందులో భాగంగా దిల్లీలోని కొన్ని దుకాణాల్లో రహస్య కెమెరాలు ఉంచి చిత్రీకరించారు. సినిమాలో ఎలా కనిపిస్తుందో అదే విధంగా సిద్ధమై, పలువురు యాసిడ్‌ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది దీపిక. అదే సమయంలో ఆయా దుకాణాల్లో ఉన్న కొందరు వీరిని చూసి చిరాకు పడ్డారు. విసుగు తెచ్చుకున్నారు. కొందరు స్నేహంగా పలకరించారు. ఈ వీడియోను నెట్టింట్లో పెట్టింది చిత్ర బృందం. దీపికను చూస్తే భారీ సంఖ్యలో సెల్ఫీలంటూ గుమిగూడే జనం బాధితురాలిగా కనిపించడంతో పట్టించుకోకపోవడం గమనార్హం.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.