యుఎస్‌లో విడుదల అవుతోన్న పూజా బాత్రా ‘ద్రౌపది అన్లీషెడ్’‌

బాలీవుడ్‌ మోడల్‌ నటి ఫెమినా మిస్‌ ఇండియా పూజా బాత్రా నటిస్తున్న చిత్రం ‘ద్రౌపది అన్లీషెడ్’‌. టోనీ స్టాప్పరన్ దర్శకత్వంలో నిషా సభర్వాల్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా 1930నాటి బ్రిటీష్‌ ఇండియాలోని ఓ టీనేజ్‌ అమ్మాయి చుట్టూ తిరుగుతోంది. ఆమె వివాహం తన ప్రమేయం లేకుండా జరుగుతుంది. పెద్దలు కుదర్చిన వివాహాలంటే ఇష్టం ఉండదు. ఆమె తనదైన గుర్తింపు కోసం ఆరాటపడుతోంది. మధ్యలో ఓ శక్తివంతమైన గురువు, అతను చేసే అవకతవక కార్యాలను ఎత్తిచూపుతోంది. అటువంటి పురుషాధ్యిక సమాజంలో తరువాత ఆమె ఎలా నెగ్గకొచ్చిందనేది మిగిలిన కథ. ఈ సినిమా గురువారం యుఎస్‌లో విడదుల కానుంది. ఇదే విషయాన్ని పూజా బాత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ‘‘నేను నటించిన ‘ద్రౌపది అన్లీషెడ్’‌ చిత్రం గురువారం యుఎస్‌ థియేటర్లలో విడుదలవుతోంది. కోవిడ్‌- 19 పాండమిక్ తరువాత తొలిసారిగా యుఎస్‌లో విడుదల చేసిన మొదటి భారతీయ చిత్రంగా నిలుస్తోంది. 1930 భారతదేశంలోని పదహారేళ్ల వయసున్నఇందిరా నిజమైన ప్రేమ కోసం, పెద్దలు కుదర్చి చేసిన వివాహం, ఒక మర్మమైన గురువు యొక్క శక్తివంతమైన ఆకర్షణల మధ్య ఎలా నలిగిపోయింది. తరువాత ఆమె స్వీయ అన్వేషణకు తన హృదయ విదారక ప్రయాణం ద్వారా, దీర్ఘకాల రహస్యాలు వెలుగులోకి వస్తాయి. వాటి నుంచి విముక్తి పొందే శక్తిని ఇందిరా కనుగొంటుంది. పితృస్వామ్య సమాజంలో కఠినమైన వాస్తవాలతో మాయా - వాస్తవికత, అందమైన పరిసరాలను మిళితం చేసే కథ. ఇందులో ఆ యువతి తన జీవితంలోని విషయాలను అందంగా చెప్పిన ఈ కథ. 20వ శతాబ్దం ప్రారంభంలో కులీన భారతీయ సమాజంలో అరుదైన రూపాన్ని అందిస్తుంది. అదేంటో రేపు.. మీరు సినిమా చూసిన తరువాత ప్రేక్షకుల స్పందన  ప్రతిధ్వనిస్తుందని’’ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇంకా చిత్రంలో కాస్ అన్వర్, తాహా తాహా షా బదుషా,అబీ బైస్, టెరిఎన్నా బ్లాంకో, మెలానీ చంద్ర, గోపాల్‌ దివాన్‌, అన్నా జార్జ్ తదితరులు నటిస్తున్నారు. పూజా బత్రా ప్రస్తుతం డానీ డెంజోంగ్పా తనయుడు రిన్జింగ్‌తో కలిసి ‘స్వాడ్’‌ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. పూజా బత్రా తెలుగులో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్‌తో కలిసి ‘గ్రీకువీరుడు’ చిత్రంలో నటించింది. అంతకు ముందు అక్కినేనివారి ‘సిసింద్రీ’ చిత్రంలో పూజాగా అతిధి పాత్రలో కనిపించింది.View this post on Instagram

A post shared by Pooja Batra Shah (@poojabatra) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.