‘ఫోటోగ్రాఫ్‌’ మార్చిలో
                                     

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, సానియా మల్హోత్రాలు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఫోటోగ్రాఫ్‌’. ‘ఇట్‌ ఆల్‌ షేర్‌డ్‌ విత్‌ ఫోటోగ్రాఫ్‌’ ట్యాగ్‌లైన్‌. రితేష్‌ బట్రా దర్శకత్వంలో రూపొందింది. తాజాగా ఈ సినిమా టీజర్, పోస్టర్‌ విడుదలైంది. పోస్టర్‌లో సానియా, నవాజుద్దీన్‌లు రోడ్డుపై నడిచి వెళుతున్న దృశ్యం కనిపిస్తుండగా వెనుక భాగంలో గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తోంది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరుగనున్న సన్‌డెన్‌ ఫిలిం ఫెస్టివల్, బెర్లిన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రితేష్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన మరో సినిమా ‘లంచ్‌బాక్స్‌’. ఈ సినిమాలో కూడా నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించి ప్రేక్షకుల ప్రశంశలను అందుకొన్నారు. ‘బధాయిహో’ చిత్రంలో కళాశాల విద్యార్థిని పాత్రలో సానియా నటించింది. అమెజాన్‌ స్టూడియోస్, మ్యాచ్‌ ఫ్యాక్టరీల నిర్మాణంలో ఈ సినిమా రూపొందించారు. భారతదేశంలో మార్చి 8న విడుదలై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.