నవ్విస్తున్న ‘గిన్ని వెడ్స్ సన్నీ’ ట్రైలర్‌

యామి గౌతమ్‌, బుల్లితెర నుంచి పెద్ద చిత్రాల్లో నటిస్తూ పేరుతెచ్చుకున్న నటుడు విక్రాంత్ మాస్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ డ్రామా చిత్రం ‘గిన్ని వెడ్స్ సన్నీ’. పునీత్‌ ఖన్నా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. సౌందర్య ప్రొడక్షన్‌ పతాకపై తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. చిత్రం కథేంటంటే గిన్నీగిల్‌ (యామి గౌతమ్‌) పొగరుబోతు అమ్మాయి. సన్నీ మల్హోత్రా (విక్రాంత్‌ మాస్సే)లు ఒక వివాహంలో కలుసుకుంటారు. అయితే సన్నీ తన ప్రేమను గిన్నీకి ప్రపోజ్‌ చేయగా అతని ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో సన్నీ తన ప్రేమను గెలుచుకోవటానికి గిన్ని తల్లితో పరిచయం పెంచుకొని తరువాత ఏం చేశాడనేది కథ. చిత్రంలో మణిశర్మ, సుహైల్‌ నయ్యర్‌, రాజీవ్‌ గుప్తా, ఆయేషా రాజా తదితరులు నటిస్తున్నారు. వినోద్‌ బచ్చన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి పాయల్‌ దేవ్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. చిత్రం అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.