ఆకట్టుకుంటోన్న ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌ ట్రైలర్‌

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ యుద్ధఫైలట్‌గా నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్’. శరణ్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో జాన్వీ కపూర్‌ తన కలలను సాకారం చేసుకోవడానికి ఏం చేసింది. ఎంత దూరం వెళ్లడానికి సిద్ధం ఉంది. అందుకు ఆమె చేసిన సాహసాలు ఏమిటనేది మిగతా కథ. పెద్ద కలలతో మనసును నింపుకున్న ఓ సాధారణమైన అమ్మాయి మైదానంలో ఎదురేగిన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నది అనే ఉత్తేజకరమైన నిజమైన యదార్ధ కథ ఈ చిత్రం. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్’ చిత్రంలో జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించగా, పంకజ్‌ త్రిపాఠి ఆమె తండ్రిగా, అంగద్‌ బేడీ సోదరుడిగా నటిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. చిత్రం మార్చి 13, 2020న తెరపైకి రావాల్సింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఏప్రిల్‌ 24 వాయిదా పడింది. ప్రస్తుతం చిత్రం నెట్‌ప్లిక్స్ ద్వారా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన అధికారికి ట్విట్టర్లో పేర్కొంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.