ఇండియన్‌ ఒసామా ఎలా చిక్కాడు??

అతనో కరుడు గట్టిన ఉగ్రవాది. 2007 నుంచి 2013 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 52 బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ దాడుల ద్వారా 433 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడంతో పాటు 810 మందిని క్షతగాత్రులను చేశాడు. కానీ, అతనెలా ఉంటాడో? ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు? అందరి దృష్టిలో వాడొక ‘ఇండియన్‌ ఒసామా’. మరి ఇంతటి ఉగ్రవాదిని చివరకు ఎలా పట్టుకున్నారు. అతని కోసం చేపట్టి ఆపరేషన్‌ ఏంటి? తెలియాలంటే ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ చూడాల్సిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రాజ్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించారు. మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఇది ఓ యుద్ధం.. ఈ యుద్ధంలో నేను చంపొచ్చు, చావచ్చు. కానీ, నేను చంపినా, చచ్చినా వెü™్లది స్వర్గానికే’’ అంటూ ఓ ఉగ్రవాది చెప్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఈ భయంకరమైన ఉగ్రవాదిని ఒక్క బుల్లెట్‌ కూడా వాడకుండా మన దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఎలా పట్టుకున్నారన్నదే చిత్ర కథ. ఈ ఐదుగురిలో ఒకరిగా.. ప్రభాత్‌ అనే ఇంటెలిజెంట్‌ ఆఫీసర్‌ పాత్రను అర్జున్‌ కపూర్‌ చేశారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.