భయపెడుతున్న ‘కాళి ఖుహి’ ట్రైలర్‌

ఆడ శిశువు హత్య, దాని పర్యావసానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రం ‘కాళి ఖుహి’. టెర్రీ సముంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్‌ నటి షబానా అజ్మీ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. అసలు చిత్రకథేంటంటే పంజాబ్‌లోని ఓ గ్రామంలో ఓ ఆడశిశువును హత్య చేస్తారు. అయితే చనిపోయిన ఆ శిశువు గ్రామంలోని వ్యక్తులను అర్థం కాకుండా చంపేస్తుంది. దాంతో ఆ ఊర్లోకి శివాంగి అనే బాలిక తన తల్లితండ్రులతో కలిసి వస్తుంది. అది వాళ్ల పూర్వికుల గ్రామం. అనుకోకుండా ఓ నల్లబావి దగ్గరకి వెళ్లగానే అందులోని రహస్యాలు తెలుస్తాయి. దాంతో ఆ పదేళ్ల శివాంగి తన కుటుంబంతో పాటు, మిగతా గ్రామస్తులను ఎలా కాపాడుతుందో లేదో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చిత్రంలో శివాంగి పాత్రలో రివా అరోరా, శివాంగి నానమ్మగా షబానా నటించింది. ఇంకా లీలా సామ్సన్‌, సంజీదా షేక్‌, సత్యదీప్‌ మిశ్రా తదితరులు నటించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 30, 2020న నెట్‌ప్లిక్స్ లో విడుదల కానుంది.

                               



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.