కొత్త లుక్‌తో ‘కబీర్‌సింగ్‌’

తెలుగులో భారీ విజయం అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. షాహిద్‌ కపూర్‌ కథానాయకుడు. కియారా అడ్వాణీ నాయిక. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగాయే హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.