అక్టోబర్‌ 2న విడుదల కానున్న ఖాలీ పీలీ

మక్బూల్‌ ఖాన్‌ దర్శకత్వంలో ధడక్‌ నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ నటిస్తున్న చిత్రం ‘ఖాలీ పీలీ’. అనన్య పాండే కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రాన్నిజీ స్టూడియోస్‌, ఆఫ్‌సైడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్‌ 2, 2020న చిత్రాన్ని జీ ఫ్లెక్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా హక్కుల కోసం తొలుత నెట్‌ఫ్లిక్స్ ను సంప్రదించారట. చివరకు హక్కులను జీఫ్లస్ దక్కించుకుంది. అందులోనూ ఈ సినిమా నిర్మాణంలో స్టూడియోస్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. చిత్ర కథేంటంటే బండా బ్లాకీ (ఇషాన్‌ ఖట్టర్‌) పూజా గుజ్జర్‌ (అనన్య పాండే)లు చిన్నప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. పూజా 18 ఏళ్ల వయసులో వేశ్యగృహంలో చిక్కుని ఉంటుంది. ఆ తరువాత అక్కడ నుంచి డబ్బు, నగలతో ఉన్న బ్యాగ్‌తో తప్పించుకోవాలని నిర్ణయించుకుంటోంది. ముంబైలోని టాక్సీడ్రైవర్‌గా ఉన్న బండా బ్లాకీ టాక్సీలో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య ఒప్పందంతో ఎక్కువ డబ్బు ఇస్తానడంతో బాక్లీ ఒప్పుకుంటాడు. వీరిని పోలీసులు, రౌడీలు వెంబడిస్తుంటారు. ఆ తరువాత వీళ్లు ఎలా బయటపడ్డారనేది మిగిలిన కథ. రొమాంటిక్‌ యాక్షన్‌ కథా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో జైదీప్ అహ్లవత్, సతీష్ కౌశిక్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్‌ - శేఖర్‌ సంగీత స్వరాలు అందిస్తుండగా, ఆదిల్ అఫ్సర్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా నిర్మాతలు.


View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.