యాక్షన్‌ చిత్రాలు చేయడం చాలా ఇష్టం: కృతి ఖర్బందా

‘బోణి’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అందాల భామ కృతి ఖర్బందా. తీన్‌మార్‌’, ‘ఒంగోలు గిత్త’, ‘మిస్టర్‌ నూకయ్య’, ‘ఓం త్రీడీ’, ‘బ్రూస్‌లీ’ తదితర సినిమాల్లో నటించి అలరించింది. గత కొన్నళ్లుగా హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘తైష్’‌ అనే యాక్షన్‌ రివేంజ్‌ చిత్రంలో నటిస్తుంది. బీజోయ్‌ నంబియార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తన పాత్ర గురించి కృతి మాట్లాడుతూ..‘‘యాక్షన్‌ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. పోరాట సన్నివేశాలతో పాటు గో-కార్టింగ్‌ అంటే నాకు చిన్నప్పుటి నుంచి చాలా ఇష్టం. ఈ చిత్రంలో గోకార్ట్ డ్రైవ్‌ చేసే అవకాశం వచ్చింది. చిత్రంలో కారు చేజ్‌ సీక్వెన్స్ ఉంది. దానికోసం విశాలమైన రహదారిపై డ్రైవ్‌ చేయాలి. ఓ సన్నివేశంలో నిజంగా స్కిడ్ ఉన్న షాట్లో నాకు చాలా భయమేసింది. అప్పుడు కారుని నియంత్రించడం కొంచెం కష్టమైంది. నేను ఇంతవరకు పోషించిన పాత్రలకంటే ఇది చాలా భిన్నమైనది. నేను చిత్రంలో అర్ఫాన్‌ఖాన్‌ ప్రేమించే పాత్రలో నటిస్తున్నాని’’ చెప్పింది. చిత్రంలో పుల్కిత్ సామ్రాట్, జిమ్ సర్బ్, హర్షవర్ధన్ రాణే, సంజీదా షేక్ తదితరులు నటిస్తున్నారు. ఈజీ మై ట్రిప్‌, గేట్‌వే పిక్చర్స్, సోహమ్‌ రాక్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి నిశాంత్‌ పిత్తి, దీపక్‌ ముక్త్ నిర్మాతలు. చిత్రం అక్టోబక్‌ 29, 2020న జీ5 ఓటీటీ వేదిక ద్వారా విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.