అక్షయ్‌ ‘లక్ష్మీ బాంబ్‌’ అంటించారు..

రాఘవ లారెన్స్‌ తెరకెక్కించిన ‘కాంచన’ సిరీస్‌ చిత్రాలకు దక్షిణాదిలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ సిరీస్‌లోని తొలి భాగం ‘కాంచన’.. ‘లక్ష్మీబాంబ్‌’ పేరుతో ఉత్తరాది ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా కనిపించబోతుండగా.. కియారా అడ్వాణి ఆయనకు జోడీగా నటించనుంది. మాతృకను తెరకెక్కించిన లారెన్సే దీన్నీ తెరకెక్కిస్తున్నారు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ సమర్పిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌లో అక్షయ్‌ కళ్లకు కాటుక పెట్టుకుంటూ దర్శనమిచ్చారు. ‘‘ఓ చక్కటి కథను మీకు చూపించబోతున్నాం’’ అంటూ ఈ పోస్టర్‌ను అక్షయ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ చిత్రాన్ని 2020 జూన్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పోస్టర్‌ ద్వారా ప్రకటించింది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఫర్హాద్‌ సామ్‌జీ రచయితగా పనిచేస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.