అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్. రాఘవ లారెన్స్ దర్శకుడు. తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు అక్షయ్. తెలుగులో లారెన్స్ కథానాయకుడుగా నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది ‘లక్ష్మీబాంబ్’. తెలుగులోనూ లారెన్సే దర్శకుడు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్ హౌజ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.