‘లక్ష్మీ’ సందడి మొదలైంది

సినిమా తెరకెక్కించడమే కాదు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమూ కళే. కథ బావున్నా ప్రచారం లేని సినిమాల పరిస్థితి ఏంటో చాలామందికి తెలిసిన విషయమే. ఇందుకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ తేడా ఏమీ ఉండదు. అగ్ర నటులైనా.. కొత్తవారైనా తాము నటించిన చిత్రాల గురించి ప్రొమోట్‌ చేయాల్సిందే. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందుకు సందడీ చేయాల్సిందే. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇదే జోరు చూపిస్తూ సినీ ప్రియుల్ని తనవైపు తిప్పుకుంటున్నారు. ఈయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘లక్ష్మీ’. కియారా అడ్వాణీ నాయిక. రాఘవ లారెన్స్‌ దర్శకుడు.ఇప్పటికే ట్రైలర్‌ని విడుదల చేయగా.. తాజాగా ఓ ప్రోమోని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.దీపావళి కానుకగా నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌ సీరియస్‌ లుక్‌లో భయపెడుతూ కనిపించాడు.తెలుగులో లారెన్స్‌ కథానాయకుడుగా నటించిన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. తెలుగులోనూ లారెన్సే దర్శకుడు. కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్, తుషార్‌ ఎంటర్‌టైన్‌ హౌజ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మరి ఈ హిందీ కాంచన అలియాస్‌ లక్ష్మీ ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే కదా!



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.