వైవిధ్యంగా ఉన్న ‘లుడో’ ట్రైలర్‌

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న డార్క్ ఆంథాలజీ హాస్య చిత్రం ‘లుడో’. టీ సీరీస్‌, అనురాగ్‌ బసు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, రాజ్‌కుమార్‌ రావ్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, పంకజ్‌ త్రిపాఠిలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. చిత్ర కథేంటంటే నలుగురు వ్యక్తుల వేర్వురు కథల ఆధారంగా చిత్రం నడుస్తోంది. ఆ నాలుగు విభిన్నమైన కథలు అనివార్యమైన పరిస్థితులు, కొన్ని యాదృచ్చిక సంఘటనలు మనకు తారసపడతాయి. ఇందులో ఇంకా సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్‌, పంకజ్‌ త్రిపాఠి, రోహిత్‌ సురేష్‌ షరాఫ్‌, పెర్ల్ మానీ, ఆశా నేగి తదితరులు నటించారు. చిత్రానికి భూషణ్ కుమార్‌, దివ్యా ఖోస్లా కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ నిర్మాతలు. ప్రీతమ్‌ చక్రవర్తి సంగీత స్వరాలు అందిసున్న చిత్రం నవంబర్‌ 12, 2020న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.