అర్జున్‌ రాంపాల్ ‘నెయిల్ పాలిష్’‌ టీజర్‌

బాలీవుడ్‌ మోడల్‌ నటుడు అర్జున్‌ రాంపాల్ నటిస్తున్న చిత్రం ‘నెయిల్‌ పాలిష్’. భార్గవ కృష్ణ దర్శకత్వంలో తరకెక్కుతున్న ఈ చిత్రం కోర్టు వ్యవహారాలు, నేరపూరితమైన ప్రయాణం నేపథ్యంలో సాగనుంది. చిత్రంలో మానవ్‌ కౌల్‌, రజిత్‌ కపూర్‌, ఆనంద్‌ తివారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదలై ఉత్కంఠభరితంగా సాగుతుంది. టెన్ ఇయర్స్ యంగర్ ప్రొడక్షన్స్ అండ్‌ ధీరజ్ వినోద్ కపూర్ నిర్మించిన చిత్రానికి ప్రదీప్‌ అపూర్‌, సీమా మోహపాత్రలు నిర్మాతలు. చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌ న్యాయవాది జైసింగ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా స్ర్కిప్టు టైటిల్‌ విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇది ప్రతి ఒక్కరకి కచ్చితంగా నచ్చితీరుతుందని’’ అన్నారు. హిప్నోటిక్‌ మిస్టరీ చేధించే ఈ చిత్రం జనవరి 1, 2021న జీ5 ద్వారా తెరపైకి రానుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.