‘అర్జున్‌రెడ్డి’ నటితో పరేష్‌ రావల్‌ తనయుడు

ప్రముఖ బాలీవుడ్‌ హాస్యనటుడు పరేష్‌ రావల్‌ తనయుడు ఆదిత్య రావల్‌ నటిస్తున్న చిత్రం ‘బామ్‌ఫాద్‌’. తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అర్జున్‌ రెడ్డి’ నటి షాలిని పాండే కథానాయికగా నటిస్తోంది. అనురాగ్‌ కశ్యప్‌ సమర్పణలో రంజన్‌ చందేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో ఆదిత్య రావల్‌ మాట్లాడుతూ ‘‘ఇలాంటి థ్రిల్లింగ్‌ నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను నాసిర్‌ జమాల్‌ అనే పాత్రలో నటిస్తున్నా. ఈ సినిమాలో కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నటుడిగా నేనేంటో నీరూపించకుంటాన’’ని చెబుతున్నాడు. కథానాయిక షాలిని ‘‘ఒక నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పుడు అలాంటి పాత్ర దక్కింది. ఇందులో నీలం అనే అమ్మాయి పాత్రలో చేస్తున్నా. కచ్చితంగా ఆకట్టుకుటుందని బలంగా నమ్ముతున్నా’’ అంటోంది. అలహాబాద్‌ కేంద్రంగా ప్రేమకథా నేపథ్యంలో వైవిథ్యంగా తెరకెక్కిన చిత్రాన్ని జార్‌ పిక్చర్స్, షైకా ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి. తెలుగు నటుడు నాని హీరోగా వచ్చిన ‘ఎంసీఏ’లో చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్‌ వర్మతో పాటు జతిన్‌ సర్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 10న జీ5 ప్రిమియమ్‌ (ఓవర్‌-ది-టాప్‌ మీడియా) ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.