అక్టోబర్‌లో ‘సర్ధార్‌ ఉద్దమ్‌ సింగ్‌’ విడుదల

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సర్ధార్‌ ఉద్దమ్‌ సింగ్‌’. సుజీత్‌ సిర్కార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 2, 2020న తెరపైకి రానుందని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. భారత విప్లవ వీరుడు సర్ధార్‌ ఉద్దమ్‌ సింగ్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రైజింగ్‌ సన్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తుంది. కథలోకి వెళ్తే బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా భారతీయులు పోరాడుతున్న సందర్భం అది. 1919వ సంవత్సరం పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో భారతీయులంతా అహింసాయుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాటి పంజాబ్‌ గవర్నర్‌ మైఖల్‌ ఓ డయ్యర్‌ శాంతియుతంగా సాగుతన్న సందర్భంలో ఒక్కసారిగా పోలీసులతో విరుచుకుపడి జనాన్ని తుపాకులతో కాల్చిచంపారు. అందుకు ప్రతీకారంగా ఉద్దమ్‌ సింగ్‌ డయ్యర్‌ను లండన్‌లో మార్చి 13, 1940లో కాల్చి చంపాడు. వెంటనే ఉద్దమ్‌సింగ్‌ని అరెస్ట్‌ చేసి జులై 31, 1940న ఉరితీశారు. ఉద్దమ్‌ సింగ్‌ జీవితంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రోన్ని లహిరి, షీల్‌ కుమార్‌ నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు . 1999లో సర్ధార్‌ ఉద్దమ్‌ సింగ్‌పై ‘సాహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌’ అనే సినిమా వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రధారిగా రాజ్‌ బబ్బర్‌ నటించగా, గురుదాస్‌ మన్‌ భగత్‌ సింగ్‌గా, ముహ్మద్‌ ఖాన్‌ పాత్రలో శత్రుఘ్న సిన్హా నటించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.