రేప్‌ బాధితురాలిగా మీరా చోప్రా

బాలీవుడ్‌ నటి మీరా చోప్రా ‘బంగారం’ చిత్రంలో పవన్‌ సరసన సంధ్యగా నటించింది. ప్రస్తుతం అక్షయ్‌ ఖన్నా, రిచా చద్దాలు కలిసి నటిస్తున్న ‘ఆర్టికల్‌ 375’ చిత్రంలో రేప్‌ బాధితురాలి పాత్రలో మీరా నటిస్తుంది. అజయ్‌ భల్‌ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని పనోరమ స్టూడియోస్, టీ-సీరీస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాలో అక్షయ్‌ క్రిమినల్‌ లాయర్‌ తరుణ్‌ సల్జాగా నటిస్తుండగా మరోవైపు రిచా చద్దా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హిరాల్‌ మోహతాగా నటిస్తున్నారు. ఇక భాదితురాలైన అంజలి డాంగిల్‌ మీరా నటిస్తుంది. చిత్రం గురించి మీరా మాట్లాడుతూ.. ‘‘అక్షయ్, రిచాలు వారిద్దరు మంచి నటులు అన్న సంగతి తెలిసిందే. నేను వారితో పోటీపడి మరీ నటించాను. వారిద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్న ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడే మనం మన నటను ఆవిష్కరించే వీలుంటుంది. సినిమాలోని కోర్టు సన్నివేశాలు చాలా కీలకం. ఆ సమయంలో నాకు చాలా సహాయపడ్డారు. ఇందులో అంజలి డాంగిల్‌ పాత్ర చాలా కీలకం’’మని చెబుతోంది. చిత్రంలో అతుల్‌ కులకర్ణి, రాహుల్‌భట్, కృతిక దేశాయి తదితర నటీనటులు నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 13, 2019న చిత్రం విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.