నా మేకప్‌ నేనే వేసుకుంటాను: శ్వేతా బసు ప్రసాద్‌

‘కొత్తబంగారులోకం’ చిత్రంలో ‘ఎ..క..డ’..‘ఎం..దు..కు’ అంటూ ధీర్ఘాలు తీస్తూ చిట్టి చిట్టి మాటలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శ్వేత బసు ప్రసాద్‌. ‘‘నా మేకప్‌ నేనే వేసుకుంటాను. నేను ఎవరి నుంచి ఈ విద్య నేర్చుకోలేదని’’ చెబుతోంది శ్వేత. ప్రస్తుతం ఆమె ‘కామెడీ కపుల్’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. సినిమా షూటింగ్‌ ధిల్లీ, గుర్గావ్‌ ప్రాంతాల్లో తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ..‘‘నేను గత కొన్ని సంవత్సరాలుగా నా మేకప్‌ నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే పాత్ర ఏంటో నాకు తెలుసు. దాని ప్రకారం నేను మేకప్‌ వేసుకుంటున్నా. ఇది ఒక కళలాంటిదని’’ చెప్పింది. నచికేత్ సమంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రాజేష్‌ తైలాంగ్‌, సాకీబ్‌ సలీమ్‌, పూజా బేడీ, ఆధార్‌ మాలిక్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. సినిమా అక్టోబర్‌ 21, 2020న జీ5లో విడుదల కానుంది. తెలుగులో ‘కాస్కో’, ‘రైడ్‌’, ‘కళావర్‌ కింగ్‌’, ‘మిక్సర్‌ పొట్లం’లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది.

View this post on Instagram

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.