ఫిబ్రవరి 30లాంటోడు నావాడు: ఊర్వశి

బాలీవుడ్‌ నాయిక ఊర్వశి రౌటేలా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వర్జిన్‌ భానుప్రియ’. ఈ సినిమాను నేరుగా ఈ నెల 16న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తన ప్రియుడికి సంబంధించి ఓ పోస్ట్‌ పెట్టింది ఊర్వశి. ‘‘నా ప్రియుడు ఫిబ్రవరి 30లాంటోడు. అంటే నాకు ప్రియుడు లేడు’’ అంటూ పోస్ట్‌ చేసింది. ‘వర్జిన్‌ భానుప్రియ’ ట్రైలర్‌కు లభిస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేసింది.

భానుప్రియ కథేంటి?

సంప్రదాయ కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయి భానుప్రియ. ఎలాగైనా తన కన్యత్వాన్ని కోల్పోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఫలితం ఉండదు. ఆ తర్వాత ఏమైంది? అనేది అసలు కథ.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.